Madhya Pradesh: ‘రీటేక్ అదిరింది.. ఓవరాక్టింగ్ తగ్గించాలి’.. గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడి మీద పోలీస్ యాక్షన్‭పై విమర్శలు

దుర్మార్గానికి పాల్పడ్డ నేరస్థుడితో పోలీసులు వ్యవహరించిన తీరు ఇదేనా అంటూ ట్రోల్స్ చేశారు. దీంతో సిద్ధి పోలీసులు గురువారం మరో వీడియోను విడుదల చేశారు. శుక్లాను కొడుతూ, తోసుకుంటూ తీసుకెళ్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. అయితే దీనిపై కూడా విమర్శలు రావడం గమనార్హం

Madhya Pradesh: ‘రీటేక్ అదిరింది.. ఓవరాక్టింగ్ తగ్గించాలి’.. గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడి మీద పోలీస్ యాక్షన్‭పై విమర్శలు

Parvesh Shukla Videlo: మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలోని సిద్ధి జిల్లాలో ఓ గిరిజనుడిని అవమానించిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నెటిజెన్లు షేర్ చేస్తూ శివరాజ్ సింగ్ చౌహాన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అయితే సీఎం శివరాజ్ వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అనంతరం దశమత్ రావత్ అనే గిరిజన బాధితుడిని తన ఇంటికి పిలిపించుకున్న శివరాజ్.. అతడి కాళ్లు కడిగి, క్షమాపణలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి ముందు బుధవారం సాయంత్రం ప్రవేశ్ శుక్లా ఇంటిని బుల్డోజర్‭తో కూల్చివేయించారు.

MadhyaPradesh CM : మూత్ర విసర్జన ఘటనలో.. గిరిజన బాధితుడి కాళ్లు కడిగిన మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్

అయితే నిందితుడు బీజేపీ ప్రవేశ్ శుక్లాను అరెస్ట్ చేసిన సమయంలో పోలీస్ స్టేషన్‌లోకి దర్జాగా వెళ్తున్నట్లు ఓ వీడియోలో కనిపించడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. దుర్మార్గానికి పాల్పడ్డ నేరస్థుడితో పోలీసులు వ్యవహరించిన తీరు ఇదేనా అంటూ ట్రోల్స్ చేశారు. దీంతో సిద్ధి పోలీసులు గురువారం మరో వీడియోను విడుదల చేశారు. శుక్లాను కొడుతూ, తోసుకుంటూ తీసుకెళ్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. అయితే దీనిపై కూడా విమర్శలు రావడం గమనార్హం. పాత విడియోలో నిందితుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును కవర్ చేసుకునేందుకు ఇప్పుడు కొత్తగా షూట్ చేశారా అంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు.

కొత్త వీడియోపై నెటిజెన్ల రియాక్షన్..