NIA ఆర్డర్స్ : సీక్రెట్ గా జగన్ పై దాడి కేసు విచారణ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి చేసిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐఏ) విచారణ కొనసాగుతుంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి చేసిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐఏ) విచారణ కొనసాగుతుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి చేసిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐఏ) విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఇటీవలే చార్జ్‌షిట్ సైతం ఎన్ఐఏ దాఖలు చేసింది. అయితే, ఎన్ఐఏ విచారణపై విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.
ఇకపై ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విచారణ జరిగినా కూడా రహస్యంగా, ఇన్ కెమెరా ద్వారా విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన ఇరుపక్షాల న్యాయవాదులు తప్ప, మరెవ్వరూ కేసు విచారణ సమయంలో కోర్టులో ఉండకూడదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించి కోర్టులో జరిగే విచారణపై ఎలాంటి వార్తలు రాయడంగానీ, ప్రసారం చేయడంగానీ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా చేయకూడదంటూ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితులు, న్యాయవాదుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.
తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది. కేసు విచారణ వేగం పెంచేందుకు, అలాగే నిష్పాక్షికంగా విచారణ జరిగేందుకు ఇటువంటి నిబంధనలు ఉపయోగపడతాయని ఎన్ ఐఏ న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైసీపీ అధ్యక్షుడిపై గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేయాలని కూడా ఎన్ ఐ ఏ కోర్టు విచారణ బృందంను కోరింది.
Read Also: 3 నెలల్లో 24లక్షలు అప్ : తెలంగాణ ఓటర్లు 2.95 కోట్లు
Read Also: పుల్వామాపై కడుపుమండి : అమెరికాలో ఇండియన్స్ ఆందోళనలు