హైదరాబాద్‌లో ఎన్ఐఏ అధికారుల సోదాల కలకలం.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుని తీసుకొచ్చి..

ఐసిస్ పుణె మ్యాడుల్ లో పని చేశాడు రిజ్వాన్. ఢిల్లీలో అరెస్ట్ అనంతరం రిజ్వాన్ ని ఎన్ఐఏ అధికారులు ఎంక్వైరీ చేశారు.

హైదరాబాద్‌లో ఎన్ఐఏ అధికారుల సోదాల కలకలం.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుని తీసుకొచ్చి..

Hyderabad NIA Raids (Photo Credit : Google)

Updated On : September 22, 2024 / 9:06 PM IST

NIA Raids In Hyderabad : హైదరాబాద్ సైదాబాద్ గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. సుమారు 3 గంటలపాటు ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. సోదాల తర్వాత అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆగస్టులో ఢిల్లీలో రిజ్వాన్ అబ్దుల్ అనే ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. రిజ్వాన్ అబ్దుల్ ఐసిస్ తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఐసిస్ పుణె మ్యాడుల్ లో పని చేశాడు రిజ్వాన్. ఢిల్లీలో అరెస్ట్ అనంతరం రిజ్వాన్ ని ఎన్ఐఏ అధికారులు ఎంక్వైరీ చేశారు. కొంతకాలం సైదాబాద్ గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో రిజ్వాన్ ఉన్నాడని నిర్ధారించుకున్న ఎన్ఐఏ అధికారులు.. ఆ అపార్ట్ మెంట్ లో తనిఖీలు చేశారు. రిజ్వాన్ ని వెంట పెట్టుకుని సోదాలు నిర్వహించారు.

ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో సంబంధాలు ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ ను ఎన్ఐఏ అధికారులు ఇవాళ హైదరాబాద్ తీసుకొచ్చారు. సైదాబాద్ లోని గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో సుమారుగా 3 గంటలపాటు సోదాలు చేశారు. గతంలో హైదరాబాద్ నగరంలో ఉన్న సమయంలో గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో రిజ్వాన్ ఉన్నట్లు పక్కా ఆధారాలను సేకరించారు. ఇవాళ ఉదయం అతడిని తీసుకొచ్చి అపార్ట్ మెంట్ లో తనిఖీలు చేశారు. ఢిల్లీలో రిజ్వాన్ ను అరెస్ట్ చేసిన అధికారులు.. ఐసిస్ తో సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో పాటు పుణె మ్యాడుల్ లో పని చేసినట్లు గుర్తించారు.

రిజ్వాన్ ని అదుపులోకి తీసుకున్న సమయంలో అతడి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అతడి మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేశారు. దాని ఆధారంగా అతడు హైదరాబాద్ లో గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీనికి సంబంధించి పక్కా ఎవిడెన్స్ సేకరించారు. అనంతరం అతడిని హైదరాబాద్ తీసుకొచి ఎంక్వైరీ చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న సమయంలో రిజ్వాన్ ఏయే కార్యకలాపాలు చేశాడు అనేది ఆరా తీశారు ఎన్ఐఏ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఎన్ఐఏ అధికారులు వెల్లడించాల్సి ఉంది.

Also Read : బీకేర్ ఫుల్.. కొరియర్ పేరుతో ఘరానా మోసం, 20లక్షలు పొగొట్టుకున్న టెకీ..