ఎయిర్ పోర్టులో డ్రోన్లతో భారీ స్మగ్లింగ్ : 10వేల మెమెరీ కార్డులు సీజ్

  • Published By: sreehari ,Published On : November 16, 2019 / 11:04 AM IST
ఎయిర్ పోర్టులో డ్రోన్లతో భారీ స్మగ్లింగ్ : 10వేల మెమెరీ కార్డులు సీజ్

Updated On : November 16, 2019 / 11:04 AM IST

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో డ్రోన్లలో అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. డ్రోన్లతో కూడిన భారీ సామాగ్రిని కస్టమ్ బృందం స్వాధీనం చేసుకుంది. హౌంగ్ కాంగ్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా గ్రీన్ ఛానల్ దాటుతున్న సమయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

భారీ కంజైన్ మెంట్‌తో కూడిన డ్రోన్లలో తరలించే లగేజీల్లో మొబైల్ ఫోన్లు, మెమెరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు తమదైన శైలిలో ప్రశ్నించగా స్మగ్మింగ్ చేస్తున్నట్టు అంగీకరించాడు. హాంగ్ కాంగ్ నుంచి 10వేల మెమెరీ కార్డులను స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు రూ.26లక్షలు విలువ ఉంటుందని కస్టమ్స్ శాఖ వెల్లడించింది. కనీసం 10వేల మెమెరీ కార్డులు, 5 నుంచి 6 మొబైల్ ఫోన్లు, 4 DJI డ్రోన్లు, మరో నాలుగు MI డ్రోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు చేస్తున్నట్టు కస్టమ్స్ బృందం తెలిపింది.