దంతెవాడ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : March 18, 2019 / 04:02 PM IST
దంతెవాడ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

Updated On : March 18, 2019 / 4:02 PM IST

చత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో సోమవారం(మార్చి-18,2019) సీఆర్పీఎఫ్,నక్సలైట్ల మధ్య జరిగిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు.నక్సల్స్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో మరో ఐదుగురు గాయపడినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.గాయపడిన వారిని హెలికాఫ్టర్ లో హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు.రాష్ట్ర పోలీస్ యూనిట్ తో కలిసి సీఆర్పీఎఫ్ 231వ బెటాలియన్ టీమ్ జిల్లాలోని అరన్ పూర్ ఏరియాలో రోడ్ సెక్యూరిటీ డ్యూటీలో ఉన్న సమయంలో పేలుడు జరిగిందని,వారిపై నక్సల్స్ వెంటనే కాల్పులకు తెగబడ్డారని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు.