దొరికాడు దొంగ : షర్మిల కేసులో యువకుడు అరెస్టు

  • Published By: chvmurthy ,Published On : February 2, 2019 / 03:28 PM IST
దొరికాడు దొంగ : షర్మిల కేసులో యువకుడు అరెస్టు

Updated On : February 2, 2019 / 3:28 PM IST

గుంటూరు:  వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిలపై  సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, కామెంట్లు చేసిన యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో  షర్మిలను అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నించిన ప్రకాశం జిల్లా చోడవరానికి చెందిన  పెద్దిశెట్టి వెంకటేష్ అనే యువకుడిని గుంటూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వెంకటేష్ గుంటూరులోని ఆర్వీఆర్ కాలేజీలో ఎంసీఏ చదువుతున్నాడు.

జనవరి 13 న వై ఎస్ షర్మిల నగర పోలీసుల కమీషనర్ అంజన్ కుమార్ కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గూగుల్ సంస్ధ ఇచ్చిన ఐపీ అడ్రస్ ల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్  సీసీఎస్ పోలీసుస్టేషన్ కు తరలించారు. పెద్దిశెట్టి వెంకటేష్ పై సెక్షన్ 509 ఐపీసీ, 67 ఐటీ  యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.   రేపు నిందితుడిని  కోర్టులో హాజరు పరచనున్నారు.