Operation Chabutra : అర్ధరాత్రిపూట రోడ్లపై తిరుగుతున్న యువకులపై కేసులు

జగిత్యాలలో అర్ధరాత్రి పూట కూడా రోడ్లపై తిరుగుతున్న ఆకతాయిలపై పోలీసులు కొరడా ఝళిపించారు.

Operation Chabutra : అర్ధరాత్రిపూట రోడ్లపై తిరుగుతున్న యువకులపై కేసులు

Jagiryala Police

Updated On : December 5, 2021 / 11:32 AM IST

Operation Chabutra :  జగిత్యాలలో అర్ధరాత్రి పూట కూడా రోడ్లపై తిరుగుతున్న ఆకతాయిలపై పోలీసులు కొరడా ఝళిపించారు. వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. మిషన్ చెబుత్ర పేరుతో అడిషనల్ ఎస్పీ రూపేష్… డిఎస్పి ప్రకాష్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

అర్ధరాత్రి వరకు రోడ్డు పై తిరుగుతూ.. స్థానికులకు ఇబ్బందులకు గురిచేస్తున్న 67మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారికి కౌన్సెలింగ్ నిర్వహించి…. .వీరిలో 13 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు,23 మంది పై న్యూసెన్స్ యాక్ట్ కేసులు   నమోదు చేశారు.  సరైన పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అర్ధరాత్రి పూట రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.