భార్య వేధింపులు తట్టుకోలేక భర్త సూసైడ్.. ఆస్తి మొత్తం తల్లికే చెందాలని సూసైడ్ నోట్

తాళి కట్టిన భార్య కాపురానికి రాకపోవటం, భార్య, అత్తింటి వారినుంచి వేధింపులు ఎక్కువవటంతో మానసికి వేదనకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా వెల్లటూరు మండల కేంద్రంలో బుధవారం జరిగింది. గంట్యాల శ్రీధర్ (35) అనే వ్యక్తికి రామడుగు మండల కేంద్రానికి చెందిన జల అనే యువతితో 2011 లోవివాహాం జరిగింది.
వీరి కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగింది. కొంత కాలంగా దంపతులు మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు ప్రారంభమయ్యాయి. వీటిని సర్దుబాటు చేయటానికి రెండు వైపులా పెద్దల వద్ద పంచాయతీలు జరిగాయి.దీంతో శ్రీధర్ తాగుడుకు బానిసయ్యాడు. 10 రోజుల క్రితం భార్య అతడిని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి శ్రీధర్ తాగుడుకు మరితంగా బానిసై తీవ్ర మానసిక వేదనకు గురవ్వసాగాడు.
ఇలా ఉండగా 3 రోజుల క్రితం శ్రీధర్ భార్య జల, మరో మహిళను వెంటబెట్టుకు వచ్చి… పెళ్లై ఇన్నేళ్లైనా పిల్లలు పుట్టలేదు కనుక, మెడికల్ టెస్ట్ లు చేయించుకోవాలని బెదిరించి వెళ్ళింది. రెండు రోజుల్లో కరీంనగర్ వచ్చి మెడికల్ టెస్ట్ లు చేయించుకోకపోతే నీ సంగతి చూస్తామని వారు హెచ్చరించి వెళ్లారని మృతుడి తల్లి ఆరోపించింది. దీంతో పాటు భార్య తరుఫు బంధువులు కూడా అతడిని బెదిరింపులకు గురిచేశారు.
ఈవేధింపులతో మనస్తాపానికి గురైన శ్రీధర్…భార్య తరుఫు బంధువులు బెదిరింపులకు గురిచేస్తున్నారని బుధవారం నాడు ఫిర్యాదు చేయటానికి పోలీసు స్టేషన్ కు వెళ్లగా…ఎస్సై సాయంత్రం రావాలని చెప్పటంతో ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య కాపురానికి రాకపోగా బెదిరించటం, ఆమె తరుఫు బంధువులు కూడా బెదిరింపులకు గురిచేయటంతో జీవితంపై విరక్తిచెంది బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో శ్రీధర్ బంధువులు బెదిరింపులకు గురి చేసిన వారు వచ్చే దాకా మృతదేహాన్ని తీసేది లేదని ఆగ్రహం వ్యక్తం చేయగా ఎస్సై శ్రీనివాస్ వారిని సముదాయించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా…. తనకు చెందిన ఆస్తుల్లో భార్య జల కు ఎలాంటి వాటా ఇవ్వోద్దని…అన్నీ తన తల్లికే చెందాలని..మా మృతికి భార్య జల నే కారణమని ఆమెపై కేసునమోదు చేసి కఠినంగా శిక్షించాలని అలా అయితేనే తన ఆత్మ శాంతిస్తుందని శ్రీధర్ రాసిన సూసైడ్ నోట్ అతని జేబులో లభించింది.
Read: పెళ్లి పేరుతో యువకులకు వల : రూ.65 లక్షలు కాజేసిన వివాహిత మహిళ