ఇంట్లో పెట్రో కెమికల్ బాంబు పేలుడు
కృష్ణా : మచిలీపట్నం సుకర్లాబాద్ లో పెట్రో బాంబు కలకలం రేపింది. ఓ ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది.

కృష్ణా : మచిలీపట్నం సుకర్లాబాద్ లో పెట్రో బాంబు కలకలం రేపింది. ఓ ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది.
కృష్ణా : మచిలీపట్నం సుకర్లాబాద్ లో పెట్రో బాంబు కలకలం రేపింది. ఓ ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఇంటి తలుపుకు, ద్విచక్రవాహనానికి పెట్రో కెమికల్ బాంబులు అమర్చారు. మహిళ తలుపు తెరవడంతో భారీ శబ్ధంతో బాంబు పేలుడు సంభవించింది. వంట గది తలుపుకు కూడా బాంబు అమర్చినట్లు గుర్తించిన మహిళ పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న బాంబు స్క్వాడ్.. బాంబును నిర్వీర్యం చేసింది. అయితే వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడే మహిళ ఇంట్లో బాంబులను అమర్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
Read Also : భారీ తిమింగలం మృతి..కడుపులో 40 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు
పోలీసుల కథనం ప్రకారం సుకర్లాబాద్ లో గత నాలుగు సంవత్సరాలుగా సుగుణ అనే మహిళ భర్తతో విడిగా ఉంటుంది. ఓ ఆఫీసులో ఆమె పని చేస్తుంది. అయితే అదే ఆఫీస్ లో పని చేస్తున్న మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఉదయం 5 గంటల సమయంలో ఇంటి ఆమె తలుపు తీయగానే తీగ తగిలి బాంబు పేలడంతో వంట గది అద్దాలు పేలిపోయాయి. ఇంట్లో నుంచి బయటకు వచ్చే క్రమంలో బాంబులు అమర్చిన తీగలను గమినించిన మహిళ పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అమర్చిన పెట్రో కెమికల్ బాంబులను నిర్వీర్యం చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ఈ చర్యకు పాల్డడి ఉంటారని..అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే నిజాలు బయటికి వస్తాయిని పోలీసులు అంటున్నారు. బాంబులు ఎలా అమర్చారు? ఘటన వెనకాల ఎవరున్నారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.