దొరికాడు, తెలంగాణలో మద్యం షాపులు తెరుస్తారని ప్రచారం చేసిన యువకుడు అరెస్ట్

తెలంగాణలో రోజుకు రెండు గంటల పాటు మద్యం షాపులు తెరుస్తారని సోషల్ మీడియాలో నకిలీ జీవో క్రియేట్ చేసి ప్రచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని

  • Published By: veegamteam ,Published On : April 1, 2020 / 02:35 AM IST
దొరికాడు, తెలంగాణలో మద్యం షాపులు తెరుస్తారని ప్రచారం చేసిన యువకుడు అరెస్ట్

Updated On : April 1, 2020 / 2:35 AM IST

తెలంగాణలో రోజుకు రెండు గంటల పాటు మద్యం షాపులు తెరుస్తారని సోషల్ మీడియాలో నకిలీ జీవో క్రియేట్ చేసి ప్రచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని

తెలంగాణలో రోజుకు రెండు గంటల పాటు మద్యం షాపులు తెరుస్తారని సోషల్ మీడియాలో నకిలీ జీవో క్రియేట్ చేసి ప్రచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఉప్పల్‌కు చెందిన సన్నీగా గుర్తించారు. మంగళవారం (మార్చి 31,2020) అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జైలుకి తరలించారు. అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని పోలీసులు సూచించారు. వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

లాక్ డౌన్ వేళ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు పదే పదే ప్రకటించారు. అలాంటి వారిని విడిచిపెట్టమని హెచ్చరించారు. అయినా కొందరు లెక్క చేయడం లేదు. లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని రకాల షాపులు, దుకాణాలతో పాటు మద్యం దుకాణాలను కూడా ప్రభుత్వం బంద్ చేసింది. దీంతో మందు బాబులు విలవిలలాడిపోతున్నారు. మద్యం దొరక్క పిచ్చెక్కిపోతున్నారు. కొందరు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే గత ఆదివారం (మార్చి 22,2020) నుంచి రోజూ రెండు గంటలు (మ.2 గంటల నుంచి 5.30 గంటల) లిక్కర్ షాపులు తెరిచేందుకే ప్రభుత్వం నిర్ణయించిందని సోషల్ మీడియాలో న్యూస్ వచ్చింది. అంతేకాదు ఎక్సైజ్ శాఖ పేరుతో జీవో కనిపించింది. దీంతో ఇది నిజమే అనుకున్న మద్యం ప్రియులు తెగ ఖుషీ అయ్యారు. మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. ఈ ఘటనలతో అధికారులు షాక్ తిన్నారు. ఏం జరిగిందో తెలియక కంగారు పడ్డారు. ఆ తర్వాత అసలు విషయం ఏంటో తెలుసుకున్నారు. అది ఫేక్ న్యూస్ అని తేల్చడంతో మందు బాబులు తీవ్ర నిరాశ చెందారు.

ఆ తర్వాత అసత్య ప్రచారం చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. చివరికి అతడిని పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన సన్నీ అనే యువకుడు ఈ ప్రచారానికి పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు… అతడిని అరెస్ట్ చేసిన కటకటాల వెనక్కి పంపారు. మద్యం షాపులు తెరవబోతున్నారంటూ ఎక్సైజ్ శాఖ తయారు చేసినట్టుగా ఫేక్ జీవోను రూపొందించాడు సన్నీ. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు… నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. కరోనా సాకుతో ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు.

Also Read | సహకరించకపోతే, ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన వాళ్లని కాల్చి చంపాలి, బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు