పైకి స్పా, మసాజ్ సెంటర్.. లోపల పాడు పనులు..! హైదరాబాద్ కూకట్‌పల్లిలో ముఠా గుట్టురట్టు
ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

Spa Center : స్పా సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ లోని రోడ్ నెంబర్ 4లో ఒక స్పా సెంటర్ పై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. స్పా, సెలూన్ పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
హైదరాబాద్ నగరంలో రెండు చోట్ల హ్యుమన్ ట్రాఫికింగ్ పోలీసులు స్పా సెంటర్లపై దాడులు చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం చేస్తుండగా అక్కడ నలుగురు యువతులతో పాటు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కొంత నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4లోని స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పా సెంటర్ పేరుతో అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గడిచిన కొన్ని రోజులగా హైదరాబాద్ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం దందా నడుపుతున్నారు. స్పా, మసాజ్ పేర్లతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో హ్యుమన్ ట్రాఫికింగ్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రెండు చోట్ల రైడ్స్ నిర్వహించిన పోలీసులు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
గడిచిన కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ దందా నడుస్తోంది. స్పా, మసాజ్, ఆయుర్వేదిక్ స్పా పేరుతో సెంటర్లు స్టార్ట్ చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత అసలు దందా షురూ చేస్తున్నారు. దీనిపై పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీనిపై పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవన్నారు.
Also Read : కోల్‌కతా డాక్టర్ కేసులో అసలేం జరిగింది? కనిపించే దేవుళ్లకు భద్రత ఏది?