అది బాంబు పేలుడు కాదు : ఎవరూ భయపడొద్దు
రాజేంద్రనగర్ లో భారీ పేలుడు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుట్ పాత్ మీదున్న అనుమానాస్పద బాక్స్ ను ఓ వ్యక్తి తెరవగానే అది భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆ

రాజేంద్రనగర్ లో భారీ పేలుడు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుట్ పాత్ మీదున్న అనుమానాస్పద బాక్స్ ను ఓ వ్యక్తి తెరవగానే అది భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆ
రాజేంద్రనగర్ లో భారీ పేలుడు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుట్ పాత్ మీదున్న అనుమానాస్పద బాక్స్ ను ఓ వ్యక్తి తెరవగానే అది భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. రెండు చేతులు తెగిపడ్డాయి. దీంతో బాంబు పేలిందేమోనని స్థానికులు భయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపించారు. పేలింది బాంబు కాదు కెమికల్ అని తేల్చారు. ఎవరూ భయపడాల్సిన పని లేదని పోలీసులు ధైర్యం చెప్పారు. అది బాంబు పేలుడు కాదని పోలీసులు నిర్ధారించారు. కెమికల్ డబ్బా కారణంగానే పేలుడు సంభవించినట్టు గుర్తించారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
ఆదివారం(సెప్టెంబర్ 8,2019) రాజేంద్రనగర్ లో భారీ పేలుడు సంభవించింది. ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పై ఉన్న బాక్స్‌ను తెరవగానే అది పేలింది. బాధితుడిని బిచ్చగాడిగా అనుమానిస్తున్నారు పోలీసులు. రోడ్డుపై, చెత్త కుప్పల్లో సేకరించిన వస్తువులను తన బ్యాగులో వేసుకుని అక్కడ కూర్చుంటాడు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్.. ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భారీ శబ్దంతో పేలుడు సంభవిచండంతో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. బాంబు పేలిందేమోనని కంగారు పడ్డారు.