Kannada RJ Rachana : ప్రముఖ కన్నడ రేడియో జాకీ రచన గుండె పోటుతో మృతి
ప్రముఖ కన్నడ రేడియో జాకీ రచన గుండె పోటుతో మరణించారు ఆమెవయస్సు 39 సంవత్సరాలు. దశాబ్ద కాలంపాటు రేడియో మిర్చి, రేడియో సిటీతో సహా పలు రేడియో ఛానళ్ల లో పని చేసి ... తన మృదువైన స్వరంత

kannada RJ Rachana
Kannada RJ Rachana : ప్రముఖ కన్నడ రేడియో జాకీ రచన గుండె పోటుతో మరణించారు ఆమెవయస్సు 39 సంవత్సరాలు. దశాబ్ద కాలంపాటు రేడియో మిర్చి,తో పాటు పలు రేడియో ఛానళ్లలో ఆమె తన మృదువైన స్వరంతో హాస్యాన్ని మేళవించి చేసిన యాంకరింగ్ తో భారీ సంఖ్యలో శ్రోతలను సంపాదించుకుంది. బెంగుళూరులో ఆమెకు ప్రతి ఇంటిలో అభిమానులు ఏర్పడేలా ఆమె తన యాంకరింగ్ చేసేవారు.
గత కొన్ని ఏళ్లుగా ఆమె డిప్రెషన్ కు గురై తన వృత్తిని మానేసి ఇంటికే పరిమితమయ్యారు. బెంగుళూరులోని జేపీ నగర్‌లో నివాసం ఉంటున్న రచన ఈరోజు తనకు గుండెలో నొప్పిగా ఉందని తెలిపింది. ఇంట్లోని సహాయకులు వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా రచన అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.
రేడియో మిర్చితో రచనగా తన కెరీర్ ప్రారంభించిన ఆమె అసలు పేరు రెహమానా.. కేరీర్ మంచి స్ధితిలో ఉండగానే ఆమె ఏడేళ్ళ క్రితం ఆమె తన వృత్తికి గుడ్ బై చెప్పారు. శాండల్‌ఉడ్ లోని చాలామంది నటీమణులకు ఆమె డబ్బింగ్ చెప్పారు. గత కొద్దికాలంగా డిప్రెషన్‌కు లోనైన రచన తన స్నేహితులకు కూడా దూరంగా ఉండసాగారు.
Also Read : Lose Weight : బరువు తగ్గాలంటే…. అనుసరించాల్సిన 5 ఆహారనియమాలు
డిప్రెషన్, హైపర్ టెన్షన్ వలనే ఆమెకు గుండెపోటు వచ్చినట్లు స్నేహితులు భావిస్తున్నారు. ఆమె మరణం అభిమానులను శ్రేయోభిలాషులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.రచన మృతదేహాన్ని చామరాజ్ పేటలో ఉన్న ఆమె తల్లితండ్రుల నివాసానికి తరలిస్తున్నారు.