Prostitution Racket : బ్యూటీ పార్లర్ పేరుతో వ్యభిచారం-పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

బ్యూటీ పార్లర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు.

Prostitution Racket : బ్యూటీ పార్లర్ పేరుతో వ్యభిచారం-పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

Prostitution Racket

Updated On : July 1, 2021 / 9:26 PM IST

Prostitution Racket : బ్యూటీ పార్లర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సిధ్దార్ధ నగర్ సెంటర్ లో మేఘన ఫేమిలి బ్యూటీ సెలూన్ పేరుతో సుధారాణి అనే మహిళ బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. రెండు నెలల క్రితం ఆమె ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు యజమానులు చెప్పారు.

బ్యూటీ పార్లర్ లో పని చేసేందుకు ఇద్దరు యువతులను నియమించుకుంది. ఫోన్ ద్వారా విటులను రప్పించి, తన వద్ద ఉన్న యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారం సేకరించిన పోలీసులు ఆ ఇంటిపై నిఘా పెట్టి గురువారం దాడి చేశారు.

ఈదాడిలో  వ్యభిచార నిర్వాహకురాలు సుధారాణితో పాటు మరో ముగ్గురు యువకులను, ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 4 సెల్ ఫోన్లు , రూ.2,250 నగదు స్వాధీనం చేసుకున్నారు.  వ్యభిచారం చేస్తున్న బాధిత యువతులు ఇద్దరినీ స్త్రీ  సంరక్షణా  కేంద్రానికి తరలించారు.