Seize Fake Notes : ఛైన్ స్నాచర్ ఇంట్లో 40 వేల నకిలీ కరెన్సీ
వెంకట శేషయ్య ఇంట్లో 40 వేలు నకిలీ కరెన్సీ గుర్తించడం జరిగిందని, వెంకట శేషయ్య ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు జరిపినట్లు తెలిపారు. మియపూర్ లో

Rachakonda
Rachakonda Police : తీగ లాగితే డొంక కదిలినట్లు ఓ ఛైన్ స్నాచర్ ను పట్టుకుంటే…మరో పెద్ద నేరం బయటపడింది. పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ బయటపడడం పోలీసులు షాక్ తిన్నారు. నకిలీ కరెన్సీ గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. అరెస్టు చేసిన తర్వాత.. పోలీసులు అతడి ఇంటికి వెళ్లి తనిఖీలు చేయగా నకిలీ కరెన్సీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 40 వేల నకిలీ కరెన్సీ గుర్తించడం జరిగిందని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను 2022, ఫిబ్రవరి 10వ తేదీ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
Read More : Man 78 times Covid positive: వయస్సు 56..78 సార్లు పాజిటివ్..14 నెలలుగా ఐసోలేషన్‌లో చికిత్స..!
వెంకట శేషయ్య ఇంట్లో 40 వేలు నకిలీ కరెన్సీ గుర్తించడం జరిగిందని, వెంకట శేషయ్య ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు జరిపినట్లు తెలిపారు. మియపూర్ లో సంతోష్ కుమార్ ఇంట్లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్నట్లు ఆధారాలు సేకరించడం జరిగిందన్నారు. నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశామన్నారు. నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. 100, 200, 500 రూపాయల నకిలీ నోట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.
Read More : Nagarjuna- Jr NTR: సీఎం జగన్‌తో భేటికి నాగార్జున, ఎన్టీఆర్ గైర్హాజరు.. కారణం ఏంటంటే?
నిందితుల నుండి 3 లక్షల 20 వేల నకిలీ కరెన్సీ, రెండు కలర్ జీరాక్స్ ప్రింటర్స్, వాటర్ మార్క్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఓగిరెడ్డి వెంకట కృష్ణ రెడ్డి ప్రధాన నిందితుడని, ఒరిజినల్ నోటుకు దొంగ నోటుకు సైజ్ తేడా ఉంటుందని ప్రజలు గుర్తించాలని సూచించారు. కమిషన్ లకు కక్కుర్తి పడి ఈ ముఠా దొంగ నోట్లు తయారు చేస్తున్నారని, నిందితులను కస్టడీలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు చేపడుతామన్నారు. దొంగ నోటు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్.