Rape case : ఆదాయపన్నుశాఖ కమీషనర్ పై అత్యాచారం కేసు నమోదు

మహిళా వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సన్నిహితంగా మెలిగిన ఇన్ కంటాక్స్ కమీషనర్ పై  పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు.

Rape case : ఆదాయపన్నుశాఖ కమీషనర్ పై అత్యాచారం కేసు నమోదు

Rape Case

Updated On : May 19, 2021 / 5:35 PM IST

Rape case :  మహిళా వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సన్నిహితంగా మెలిగిన ఇన్ కంటాక్స్ కమీషనర్ పై  పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. 2019 లో నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ లో శిక్షణ కోసం నాగపూర్ లో ఉంటున్న, పుదుచేరి కి చెందిన ఇన్ కంటాక్స్ కమీషనర్  (35) వైద్య చికిత్స కొసం నాగపూర్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు.

అక్కడ అతనికి ఒకవైద్యురాలితో పరిచయం ఏర్పడింది. ఆ వైద్యురాలు అప్పటికే  యూపీఎస్సీపరీక్షలకు   ప్రిపేర్ అవుతోంది. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలో డాక్టర్ ఆ విషయం ఆదాయపన్ను  కమీషనర్ కు చెప్పింది. ఈక్రమంలో ఇద్దరూ ఒకరి ఫోన్ నెంబరు ఒకరు తీసుకుని మాట్లాడుకోవటం ప్రారంభించారు.

మహిళా డాక్టర్ ను తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐటీ కమీషనర్ ఆమెతో సన్నిహితంగా మెలగటం మొదలెట్టాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుని..వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు కూడా తీసుకున్నారు. కొన్నాళ్లకు  ఆమహిళ గర్భం దాల్చింది.

పెళ్లి చేసుకోమని ఆమె అడగ్గా… అబార్షన్ చేయించుకోమని సలహా చెప్పాడు. తనను పెళ్లి చేసుకోమని బలవంతం చేయటంతో తన అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు తీసుకున్న నాగపూర్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376(2) కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.