చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి వివాహితపై అత్యాచారం.. ఆ తర్వాత రూ.20లక్షలు ఇవ్వాలని వీడియోతో బ్లాక్ మెయిల్, కూకట్ పల్లిలో దారుణం

  • Published By: naveen ,Published On : October 5, 2020 / 05:32 PM IST
చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి వివాహితపై అత్యాచారం.. ఆ తర్వాత రూ.20లక్షలు ఇవ్వాలని వీడియోతో బ్లాక్ మెయిల్, కూకట్ పల్లిలో దారుణం

Updated On : October 7, 2020 / 11:54 AM IST

rape with choclates: హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణం జరిగింది. శ్రీధర్ గౌడ్ అనే వ్యక్తి వివాహితకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. మత్తు మందు కలిపిన బిస్కెట్లు, చాక్లెట్లు తినడంతో సదరు వివాహిత స్పృహ కోల్పోయింది. ఇదే అదనుగా శ్రీధర్ గౌడ్ వివాహితపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత దారుణానికి ఒడిగట్టాడు. వివాహిత స్పృహలో లేని సమయంలో నూడ్ ఫోటోలు, వీడియోలు శాడు. మత్తు నుంచి కోలుకున్న వివాహిత, జరిగిన ఘోరం తెలిసి షాక్ కి గురైంది.

కాగా వీడియోలు, ఫొటోలతో శ్రీధర్ గౌడ్ బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. తన దగ్గరున్న ఫోటోలను, వీడియోలను డిలీట్ చేయాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.

అతడి వేధింపులకు విసిగిపోయిన బాధితురాలు ధైర్యం చేసి సైబరాబాద్ షీ టీమ్ ను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన షీ టీమ్ వల పన్నింది. డబ్బు ఇచ్చే వంకతో శ్రీధర్ గౌడ్ ని రప్పించి పట్టుకున్నారు. ఆ కీచకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కాగా, శ్రీధర్ గౌడ్ బాధితురాలికి తెలిసిన వ్యక్తే. బంధువు అవుతాడు. బంధువు కావడంతో వివాహిత ఇంటికి రానిచ్చేది. వివాహితపై కన్నేసిన శ్రీధర్.. దీన్ని అదనుగా తీసుకుని దారుణానికి ఒడిగట్టాడు.

మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నా, శిక్షలు విధిస్తున్నా, ఉరి తీస్తున్నా కామాంధుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలు, యువతులు, పిల్లలు అనే తేడా లేదు.. అందరిపైనా ఘోరాలు జరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కీచకులు బరి తెగిస్తున్నారు. బంధాలు కూడా మర్చి కాటేస్తున్నారు. స్నేహం, బంధుత్వం ముసుగులో దారుణాలకు ఒడిగడుతున్నారు.