మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఫొటోలు తీసి బెదిరింపులు

విశాఖలో దారుణం జరిగింది. మత్తుమందు ఇచ్చి మహిళపై అత్యాచారం చేశాడు కీచకుడు.

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 02:13 PM IST
మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఫొటోలు తీసి బెదిరింపులు

Updated On : November 27, 2019 / 2:13 PM IST

విశాఖలో దారుణం జరిగింది. మత్తుమందు ఇచ్చి మహిళపై అత్యాచారం చేశాడు కీచకుడు.

విశాఖలో దారుణం జరిగింది. మత్తుమందు ఇచ్చి మహిళపై అత్యాచారం చేశాడు కీచకుడు. ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. వాటి ద్వారా బ్లాక్ మెయిలింగ్‌కు చేస్తూ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా తనకు డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేశాడు. పలుమార్లు డబ్బులు ఇచ్చినా అతడి వేధింపులు మాత్రం ఆగలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖకు చెందిన ఓ మహిళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. ఓ వ్యక్తి ఆమెను ట్రాప్ చేసి పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. అయితే ప్లాన్ ప్రకారం ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె నగ్నంగా ఉన్న ఫొటోలను తీశాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో ఆమెను పెడతానంటూ బెదిరించాడు.

ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమెపై మరోసారి అత్యాచారం చేశాడు. డబ్బు కావాలంటూ బెదిరించాడు. పరువు పోతుందని భావించిన బాధితురాలు… అప్పులు చేసి అతడికి రూ.50 లక్షల వరకు ఇచ్చింది. అతని వేధింపులు భరించలేని బాధితురాలు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.