బాబోయ్ : ప్లాస్టిక్ కవర్ ఇవ్వలేదని మర్డర్ చేసిన కస్టమర్
ఢిల్లీలో దారుణం జరిగింది. ఆవేశం ఒక నిండు ప్రాణం తీసింది. చిన్నపాటి వివాదం మర్డర్ కి దారితీసింది. ప్లాస్టిక్ కవర్ ఇవ్వలేదనే చిన్న కారణంతో చంపేశాడు. ఓ బేకరీలో పని చేస్తున్న

ఢిల్లీలో దారుణం జరిగింది. ఆవేశం ఒక నిండు ప్రాణం తీసింది. చిన్నపాటి వివాదం మర్డర్ కి దారితీసింది. ప్లాస్టిక్ కవర్ ఇవ్వలేదనే చిన్న కారణంతో చంపేశాడు. ఓ బేకరీలో పని చేస్తున్న
ఢిల్లీలో దారుణం జరిగింది. ఆవేశం ఒక నిండు ప్రాణం తీసింది. చిన్నపాటి వివాదం మర్డర్ కి దారితీసింది. ప్లాస్టిక్ కవర్ ఇవ్వలేదనే చిన్న కారణంతో చంపేశాడు. ఓ బేకరీలో పని చేస్తున్న వ్యక్తిని.. కస్టమర్ మర్డర్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఖలీల్ అహ్మద్ అనే వ్యక్తి దయాల్‌పూర్ ఏరియాలోని ఓ బేకరీలో పని చేస్తున్నాడు. అక్టోబర్ 15వ తేదీన బేకరీలో ఆహార పదార్థాలు కొనేందుకు 24 ఏళ్ల యువకుడు వచ్చాడు. పదార్థాలను తీసుకెళ్లేందుకు కవర్ ఇవ్వాలని బేకరీ వర్కర్‌ను యువకుడు అడిగాడు.
ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించిన క్రమంలో.. ప్లాస్టిక్ కవర్ ఇవ్వలేమని ఫైజాన్ ఖాన్‌కు ఖలీల్ చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన ఫైజాన్.. అహ్మద్ తలపై ఇటుకతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన అహ్మద్ చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ఫైజాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. స్థానికులు ఉలిక్కిపడ్డారు. వ్యాపారులు భయాందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ కవర్ ఇవ్వకపోతే చంపేస్తారా అని వాపోయారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లు, వస్తువులపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కనిపించకూడదు. వాటిని తయారు చేసినా, కొన్నా, అమ్మినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. దీంతో చాలా షాపుల్లో ప్లాస్టిక్ బ్యాగులు ఇవ్వడం ఆపేశారు. దీనిపై పూర్తిగా అవగాహన లేకపోవడంతో కస్టమర్లు గొడవలకు దిగుతున్నారు. మేము వస్తువులను ఎలా తీసుకెళ్లాలి అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వాలు స్పందించాలని.. ప్రజలకు అవగాహనం కల్పించాలని కోరుతున్నారు.