తార్నాక దగ్గర రోడ్డు ప్రమాదం : ఇద్దరి మృతి

హైదరాబాద్ : తార్నాక లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. సికింద్రాబాద్ లోని తార్నాకా డిగ్రీ కాలేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బైక్ యూ టర్న్ తీసుకునే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ, బైక్ ను ఢీ కొట్టటంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మరణించిన వారిని నవీన్, సోమరాజు గా గుర్తించారు. లారీ డ్రయివర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.