Telangana : సంగారెడ్డి జిల్లాలో 7 కిలోల బంగారం పట్టివేత
తెలంగాణలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో కిలోల కొద్దీ బంగారం, కోట్లాది రూపాయల నగదు పట్టుబడుతోంది.

Gold seized
Gold seized : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో కిలోల కొద్దీ బంగారం, కోట్లాది రూపాయల నగదు పట్టుబడుతోంది. ఇప్పటికే బంగారం, వెండి,నగదు,మద్యం పట్టుబడింది.
దీంట్లో పోలీసుల తనిఖీల్లో సంగారెడ్డి జిల్లాలో ఏకంగా 7కిలోల బంగారం పట్టుబడింది. బంగారాన్ని తరలించేవారు సరైన పత్రాలు చూపించకపోవటంతో 7కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని మాగిడి వాహన తనిఖీలు చేపట్టగా ఓ కారులో తరలిస్తున్న రూ. 4.5 కోట్ల విలువైన బంగారం పట్టుబడింది.
Hyderabad : మియాపూర్‌లో 27 కిలోల బంగారం స్వాధీనం
తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెట్టిన పోలీసులకు ఇప్పటికే బంగారం, మద్యం, వెండి ఆభరణాలతో పాటు భారీగా నగదు పట్టుబడుతోంది. దీంట్లో భాగంగా కొన్ని రోజుల క్రితంమియాపూర్ లో 27 కిలోల బంగారం, 15 కిలోల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.