ఇంట్లో గొడవ : బయటకొచ్చి ఆరుగురిని చంపేశాడు..

ఒక వ్యక్తి కుటుంబ కలహాలు ఆ కలహాలకు ఎటువంటి సంబంధం లేని ఆరుగురు వ్యక్తుల ప్రాణాలు తీసుకుంది. చైనా రాజధాని బీజింగ్‌లో క్యు లీడాంగ్ అనే వ్యక్తి ఇంట్లో జరిగిన గొడవల కారణంగా బయటకు వచ్చి కారును వేగంగా నడిపి ఆరుగురిని చంపేశాడు. రద్ధీగా ఉన్న ప్రదేశంలోకి కారును తీసుకుని వెళ్లి జన సమూహంపైకి కారును వేగంగా నడిపాడు. ఆ కారు కింద పడి ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. విచక్షణా రహితంగా కారును మనుషులపైకి ఎక్కించి తొక్కించాడు.
ఈ ఘటన చైనాలో జరిగింది. ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం మార్చి 22వ తేదీ ఉదయం 6గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కారు నడిపిన క్యు లీడాంగ్‌ను పోలీసులు కాల్చి చంపేశారు. మొదట లొంగిపోవాలని పదేపదే ఆదేశించారు. అప్పటికీ వినకుండా కారును వేగంగా నడపటానికి ప్రయత్నించాడు. దీంతో కారుపై కాల్పులు జరిపారు పోలీసులు. బుల్లెట్ గాయాలకు చనిపోయాడు అతను.