Soft Ware Engineer : పెళ్లి పేరుతో మోసం చేసిన యువకుడు అరెస్ట్
పెళ్లి చేసుకుంటానని, సొంత వ్యాపారం చేద్దామని యువతితో సహజీవనం చేసి ఆమె వద్ద రూ.37 లక్షలు తీసుకుని మోసం చేసిన యువకుడిని కూకట్ పల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Soft Ware Engineer Cheated By Colleague
Soft Ware Engineer cheated by colleague : పెళ్లి చేసుకుంటానని, సొంత వ్యాపారం చేద్దామని యువతితో సహజీవనంచేసి ఆమె వద్ద రూ.37 లక్షలు తీసుకుని మోసం చేసిన యువకుడిని కూకట్ పల్లి పోలీసులుశుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
హైదరాబాద్ ఆల్వాల్ కు చెందిన మహిళ(26) రెండేళ్ల క్రితం విప్రో సంస్ధలో ఉద్యోగంలో చేరింది. అక్కడ టీం లీడర్ గా పని చేస్తున్నమూసాపేట ఆంజనేయనగర్ కు చెందిన జై అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరూ సహజీవనం చేయసాగారు.
ఈక్రమంలో సొంతంగా వ్యాపారం ప్రారంభిద్దామని చెప్పి ఆయువతి వద్దనుంచి జై రూ. 37 లక్షల రూపాయలు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆ యువతి కోరగా అప్పటి నుంచి ఆమెను తప్పించుకు తిరగసాగాడు. దీంతో బాధితురాలు ఏప్రిల్ 3న కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
బాధిత యువతి కేసు పెట్టిందని తెలుసుకున్నజై అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. జై కోసం గాలిస్తున్న పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి అకౌంట్ లో ఉన్న రూ. 32 లక్షలను ఫ్రీజ్ చేసి రిమాండ్ కు తరలించారు.