అత్తింటి ముందే అల్లుడు అనుమానాస్పద మృతి : హత్యా? ఆత్మహత్యా…? 

  • Published By: veegamteam ,Published On : December 10, 2019 / 06:51 AM IST
అత్తింటి ముందే అల్లుడు అనుమానాస్పద మృతి : హత్యా? ఆత్మహత్యా…? 

Updated On : December 10, 2019 / 6:51 AM IST

అత్తింటి మందే అల్లుడు మృతి చెందాడు. మంటల్లో కాలిపోతు మృతి చెందాడు. యాదాద్రి జిల్లా..రాజపేట మండలం దూదివెంకటాపురం గ్రామంలో ఈ దారుణం జరిగింది. అత్తగారి ఇంటిముందే అల్లుడు కొల్లూరి నరేశ్ చనిపోయాడు. కానీ..తమ కొడుకు ఆత్మహత్య చేసుకోలేదనీ..అత్తింటివారే హత్య చేశారనీ నరేశ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  

యాదాద్రి జిల్లాలోని మోటు కొండూరుకు చెందిన నరేశ్ కు ఇటీవల రాజపేట మండలం దూదివెంకటాపురం గ్రామంలోని అత్తగారి ఇంటికి వచ్చాడు. గత కొంతకాలంగా నరేశ్ కు భార్యకు మధ్య గొడవలు జరగుతున్నాయి. దీంతో నరేశ్ భార్య పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో భార్య దగ్గరకు వచ్చిన నరేశ్ తో అత్తింటికి వచ్చి అడిగాడు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలీదుగానీ నరేశ్ మంటల్లో కాలి చనిపోయాడు.  నరేశ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడనీ  అత్తింటివారు అంటున్నారు. మరోపక్క అత్తింటివారే నరేశ్ ను హత్య చేశారని తల్లిదండ్రులు  ఆరోపిస్తున్నారు. 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..మంచంపై పడుకున్న నరేశ్ కు అత్తింటివారే పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లుగా ఓ వీడియోలో ఉందని నరేశ్ బంధువులు అంటున్నారు. నరేశ్ ను హత్య చేసిన తరువాత మంచంపై పడుకోబెట్టి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని ఆరోపిస్తూ..నరేశ్ గ్రామస్తులు ఆలూరు సమీపంలోని  హైదరాబాద్ నేషనల్ హైవే దగ్గరకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేసే ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం ఈ కేసుపై దర్యాప్తు చేస్తామని..ఆందోళన ఆపాలని పోలీసులు సూచించారు.