Hit And Drag Case: స్కూటర్‌ను ఢీకొన్న ట్రక్కు.. వృద్ధుడు, ఆరేళ్ల బాలుడు మృతి.. బాలుడి మృతదేహాన్ని రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

తాత-మనవడు స్కూటర్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ మరణించారు. అయితే, తాత అక్కడిక్కడే మరణించగా, మనవడిని మాత్రం ట్రక్కు రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. దీనికి సంబంధించిన దృశ్యాల్ని అక్కడి వాళ్లు వీడియో తీయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Hit And Drag Case: స్కూటర్‌ను ఢీకొన్న ట్రక్కు.. వృద్ధుడు, ఆరేళ్ల బాలుడు మృతి.. బాలుడి మృతదేహాన్ని రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

Updated On : February 26, 2023 / 3:03 PM IST

Hit And Drag Case: ఢిల్లీలో డిసెంబర్ 31న జరిగిన హిట్ అండ్ డ్రాగ్ వంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో ఇలాంటి మరో దారుణ ఘటన జరిగింది. తాత-మనవడు స్కూటర్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ మరణించారు.

Jammu and Kashmir: జమ్మూలో కాశ్మీర్ పండిట్ హత్య.. తుపాకులతో కాల్చిన తీవ్రవాదులు

అయితే, తాత అక్కడిక్కడే మరణించగా, మనవడిని మాత్రం ట్రక్కు రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్, మహోబాకు చెందిన ఉదిత్ నారాయణ్ చన్సోరియా (67) అనే వృద్ధుడు తన ఆరేళ్ల మవనడు సాత్విక్‌తో కలిసి స్కూటర్‌పై వెళ్తున్నాడు. కాన్పూర్-సాగర్ జాతీయ రహదారిపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ఉదిత్ నారాయణ్ ప్రమాద స్థలంలోనే మరణించాడు. అయితే, మనవడు సాత్విక్, స్కూటర్ ఆ ట్రక్కుకు చిక్కుకున్నాయి. అయినప్పటికీ డ్రైవర్ ఆ ట్రక్కును ఆపకుండా అలాగే పోనిచ్చాడు.

Rahul Gandhi: అదానీ విషయంలో నిజం బయటకొచ్చే వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం..

దాదాపు రెండు కిలోమీటర్లు ఆ స్కూటర్‌ను, సాత్విక్‌ను అలాగే లాక్కెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాల్ని అక్కడి వాళ్లు వీడియో తీయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రక్కు చిన్నారిని లాక్కెళ్తుంటే, ఇతర వాహనదారులు గమనించారు. ఆ విషయాన్ని డ్రైవర్ దృష్టికి తెచ్చి, వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అతడు వాహనాన్ని ఆపలేదు. చివరకు ట్రక్కుపై రాళ్లు వేయడంతో డ్రైవర్ ట్రక్కు ఆపేశాడు. అనంతరం ఆ చిన్నారిని బయటకు తీశారు. అయితే, అప్పటికే ఆ చిన్నారి బాలుడు కూడా మరణించాడు. దీంతో స్థానికులు డ్రైవర్‌పై దాడి చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.