Telangana : భూ వివాదాల నేపధ్యంలో యువకుడిపై హత్యాయత్నం

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ వద్ద గోలి శ్రీకాంత్ అనే వ్యక్తిపై  దుండగులు కత్తులతో దాడి చేశారు.

Telangana : భూ వివాదాల నేపధ్యంలో యువకుడిపై హత్యాయత్నం

Stabbing A Young Man

Updated On : June 21, 2021 / 9:36 PM IST

Telangana : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ వద్ద గోలి శ్రీకాంత్ అనే వ్యక్తిపై  దుండగులు కత్తులతో దాడి చేశారు. 25 కు పైగా కత్తి పోట్లు పొడిచారు.. చనిపోయాడు అనుకుని వదిలేసి వెళ్లిపోయారు.. కొనఊపిిరితో  ఉన్న శ్రీకాంత్  స్పృహలోకి వచ్చి తన స్నేహితుడికి  ఫోన్ చేశాడు. అక్కడకు వచ్చిన స్నేహితుడు హుటాహుటిన  శ్రీకాంత్‌ను  ఆస్పత్రికి తరలించాడు.

బొమ్మకల్  గ్రామానికి చెందిన గోలి శ్రీకాంత్‌ను భూమి సరిహద్దులు చూపిస్తామని పిలిచి దుండగులు కత్తులతో దాడి చేశారు.  ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. శ్రీకాంత్  మీద దాడి చేసింది రియల్ ఎస్టేట్ కు చెందిన వ్యక్తులని తెలుస్తోంది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.