తహశీల్దార్ ను తగలబెట్టిన కేసు : హత్య చేసిన వ్యక్తి రైతు.. లంచం అడిగినందుకే ఇలా..
రాష్ట్రంలో కలకలం రేపుతున్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయ సజీవదహనం కేసులో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు

రాష్ట్రంలో కలకలం రేపుతున్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయ సజీవదహనం కేసులో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు
రాష్ట్రంలో కలకలం రేపుతున్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయ సజీవదహనం కేసులో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తహశీల్దార్ ను హత్య చేసిన వ్యక్తిని రైతు సురేష్ గా పోలీసులు గుర్తించారు. పొలం రిజిస్ట్రేషన్ విషయంలో తహశీల్దార్ విజయ తన ప్రత్యర్థులతో చేతులు కలిపారని, తనను వేధించారని, లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని.. అందుకే.. ఆమెను సజీవదహనం చేశానని పోలీసుల విచారణలో రైతు సురేష్ అంగీకరించినట్టు తెలుస్తోంది.
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన నిందితుడు సురేష్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. తహశీల్దార్ ను హత్య చేశాక నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. హత్యకు కారణాలు ప్రశ్నిస్తున్నారు.
తహశీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సమయంలో.. సురేష్ కి కూడా మంటలు అంటుకున్నాయి. ఇద్దరూ మంటల్లో చిక్కుకోవడంతో… సురేష్ తన చొక్కా విప్పేశాడు. ఆ తర్వాత తలుపులు తీసి బయటకు పరుగులు పెట్టాడు. ఈ ఘటనలో సురేష్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ ఆఫీస్ లో విజయ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం(నవంబర్ 4,2019) ఉదయం విజయ ఆఫీస్ కి వచ్చారు. తన సీటులో కూర్చుని ఉన్నారు. మధ్యాహ్నం 1.20గంటల ప్రాంతంలో సురేష్ ఆఫీస్ లోకి వచ్చాడు. తహశీల్దార్ తో మాట్లాడాలని చాంబర్ లోనికి వెళ్లాడు. ఇద్దరూ అరగంట సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా లోపలి నుంచి కేకలు వినిపించాయి. తహశీల్దార్ విజయ మంటల్లో తగలబడిపోతున్నారు. ఆమె అరుచుకుంటూ బయటకు వచ్చారు.
ఇద్దరు సిబ్బంది ఆమెని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది. తీవ్ర గాయాలు కావడంతో విజయ స్పాట్ లోనే చనిపోయారు. ఆమెని కాపాడే ప్రయత్నంలో సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు విజయ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.