Chikoti Praveen : క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ అండ్ బ్యాచ్‌కు బెయిల్ ఇచ్చిన థాయ్ కోర్టు

Chikoti Praveen : థాయ్‌ల్యాండ్‌లో గ్యాంబ్లింగ్ పై నిషేధం ఉందని నాకు తెలీదు. నేను ఆర్గనైజర్ కాదు. నా పేరు కూడా ఎక్కడా లేదు.

Chikoti Praveen : క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ అండ్ బ్యాచ్‌కు బెయిల్ ఇచ్చిన థాయ్ కోర్టు

Chikoti Praveen

Updated On : May 2, 2023 / 7:07 PM IST

Chikoti Praveen : థాయ్‌ల్యాండ్‌లో గ్యాంబ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌కు ఊరట లభించింది. థాయ్ కోర్టు ప్రవీణ్ కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో ప్రవీణ్ కు థాయ్ కరెన్సీ ప్రకారం రూ.4,500 బ్యాత్స్ జరిమానా వేసింది కోర్టు. బెయిల్ రావడంతో హైదరాబాద్‌కు బయలుదేరాడు చికోటి ప్రవీణ్. ఇక, ఇండియా నుంచి వెళ్లిన అందరికీ కోర్టు బెయిల్ ఇచ్చింది. చికోటితో సహా 83మందికి బెయిల్ మంజూరైంది. వారందరి నుంచి ఫైన్ కట్టించుకుని పాస్‌పోర్టులు వెనక్కి ఇచ్చేశారు థాయ్ పోలీసులు.

గ్యాంబ్లింగ్ కేసులో అరెస్ట్ వ్యవహారంపై చికోటి ప్రవీణ్(Chikoti Praveen) స్పందించాడు. థాయ్ ల్యాండ్ లో గ్యాంబ్లింగ్ నిషేధం అని తనకు తెలియదన్నాడు. తాను హాల్ లోకి వెళ్లిన 10 నిమిషాలకే రైడ్ జరిగిందన్నాడు. తాను ఆర్గనైజర్ కాదని, తన పేరు ఎక్కడా కూడా లేదని చికోటి ప్రవీణ్ స్పష్టం చేశాడు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నానన్నాడు.

”థాయిలాండ్‌లో పోకర్ ఇల్లీగల్ అని నాకు తెలియదు. దేవ్, సీత నాకు ఆహ్వానం పంపారు. నేను వెళ్ళాను. నాలుగు రోజులు పోకర్ టోర్నమెంట్ అని చెప్పారు. ఆ టోర్నమెంట్ లీగల్ అనే చెప్పారు. లీగల్ అని నాకు లేఖ పంపారు. అందులో స్టాంప్ లు కూడా పంపారు” అని చికోటి ప్రవీణ్ తెలిపాడు.

Also Read..Thailand Gambling Case: థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌తో సహా 93మంది అరెస్ట్ ..

అసలేం జరిగిందంటే..
థాయ్ లాండ్ లో గాంబ్లింగ్ నిర్వహిస్తూ చికోటి ప్రవీణ్ అక్కడి పోలీసులకు చిక్కాడు. గోవాకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో.. దాడులు నిర్వహించిన థాయ్ పోలీసులు.. చికోటి ప్రవీణ్ తో పాటు భారత్ కు చెందిన 93మందిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అయిన 93మందిలో తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో మెదక్ కు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు.(Chikoti Praveen)

పట్టాయాలోని ఓ హోటల్ లో రూ.100 కోట్లకు పైగా గ్యాంబ్లింగ్ జరుగుతోందన్న పక్కా సమాచారంతో థాయ్ లాండ్ పోలీసులు దాడులు చేశారు. 93మందిని అరెస్ట్ చేశారు. చికోటి ప్రవీణ్.. థాయ్ మహిళలతో గ్యాంబ్లింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేసినట్లుగా థాయ్ పోలీసులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ.. హైదరాబాద్ తో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి గ్యాంబ్లింగ్ పై ఆసక్తి ఉన్న వాళ్లను చికోటి ప్రవీణ్(Chikoti Praveen).. థాయ్ లాండ్ తీసుకువెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు.

Also Read..Rajinikanth : YCP నాయకులపై ఫైర్ అవుతున్న తలైవా ఫ్యాన్స్.. ట్రెండింగ్ లో #YSRCPApologizeRajini

గ్యాంబ్లింగ్ ను ఎంజాయ్ చేసి మరికొన్ని గంటల్లో భారత్ తిరిగి వచ్చేద్దామని చికోటి ప్రవీణ్ కస్టమర్లు అనుకున్నారు. ఇంతలో థాయ్ పోలీసుల మెరుపు దాడిలో అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు ఈ దాడుల్లో రూ.21 కోట్ల విలువైన గేమింగ్ చిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు.(Chikoti Praveen)