ఘరానా దొంగ : భక్తుడిలా వచ్చి అమ్మవారి కిరీటం కొట్టేశాడు

హైదరాబాద్ లోని గన్ ఫౌండ్రీ దుర్గా భవాని ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని అమ్మవారి వెండి కిరీటాన్ని ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు.

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 11:12 AM IST
ఘరానా దొంగ : భక్తుడిలా వచ్చి అమ్మవారి కిరీటం కొట్టేశాడు

Updated On : November 21, 2019 / 11:12 AM IST

హైదరాబాద్ లోని గన్ ఫౌండ్రీ దుర్గా భవాని ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని అమ్మవారి వెండి కిరీటాన్ని ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు.

హైదరాబాద్ లోని గన్ ఫౌండ్రీ దుర్గా భవాని ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని అమ్మవారి వెండి కిరీటాన్ని ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. బుధవారం (నవంబర్20, 2019) సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిలాగా బిల్డప్ ఇస్తూ గుడిలోకి చొరబడ్డాడు. కాసేపు అమ్మవారికి దండం పెడుతున్నట్లు నటించాడు. చుట్టు పక్కల ఎవరు లేని సమయాన్ని చూసి అర కిలో బరువు ఉన్న వెండి కిరీటాన్ని దోచుకెళ్లాడు. ఆ కిరీటాన్ని ప్యాంట్ లో దాచుకుని పారి పోయాడు.

ఆ తర్వాత గుడిలోకి వచ్చిన పూజారి అమ్మవారి కరీటం మాయమైనట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరీటం విలువ రూ.30 వేలకుపైనే ఉంటుందని ఆలయ నిర్వహకులు చెబుతున్నారు. ఆలయంలో కిరీటం చోరీ అయిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రెండు రోజుల ముందు దొంగ ఏమైనా రెక్కి నిర్వహించాడా, ఆ ప్రాంతంలో తిరిగాడా లేదా వాహనాన్ని అనుమానాస్పదంగా పార్క్ చేసి వచ్చాడా అని సీసీ ఫుటేజీ కలెక్ట్ చేస్తున్నారు. కిరీటాన్ని చోరీ చేసిన తర్వాత బ్యాగ్ లో పెట్టుకుని స్క్రూటీపై వెళ్లినట్లు గుర్తించారు. ఎంట్రీ, ఎగ్జిట్ లను పరిశీలిస్తున్నారు. దొంగిలించిన తర్వాత దొంగ ఆబిడ్స్ సర్కిల్ నుంచి వెళ్తున్నట్లుగా గుర్తించారు. క్రైమ్ పార్టీ పోలీసులు దొంగ ఆచూకీని తెలుసుకుని, అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సీసీ ఫుటేజీ చాలా కీలకంగా మారింది.