Patna Airport : పాట్నా ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
హుటాహుటిన ఎయిర్ పోర్టుకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పరిసరాలను తనిఖీలు చేపట్టారు. ఎయిర్ పోర్టు లోపల, బయట, పార్కింగ్ ప్రాంతంలో విస్తృతంగా గాలిస్తున్నారు.

Patna Airport
Patna Airport : బీహార్ పాట్నాలోని ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం ఎయిర్ పోర్టులో బాంబు అమర్చినట్లు బెదిరింపులు రావడంతో పోలీసులు, ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. హుటాహుటిన ఎయిర్ పోర్టుకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. ఎయిర్ పోర్టు లోపల, బయట, పార్కింగ్ ప్రాంతంలో విస్తృతంగా గాలిస్తున్నారు.
కానీ, ఇప్పటివరకు బాంబు ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. బాంబ్ స్క్వాడ్ సెర్చింగ్ ఇంకా కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సాదిక్ నగర్ లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో బాంబు పెట్టిన్నట్లు ఉదయం 10.49 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ పంపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం ముందస్తు జాగ్రత్తగా విద్యార్థులను హుటాహుటినా అక్కడి నుంచి పంపించారు.
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు
బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే పాఠశాల ఆవరణలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు బాంబు బెదిరింపులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.