Life Imprisonment : కుక్కను చంపారని మనిషిని చంపారు-ముగ్గురికి జీవితఖైదు
తమ పెంపుడు కుక్కను చంపారనే కారణంతో ఒక వ్యక్తిని హత్యచేసి. అతని భార్యపై దాడి చేసి గాయపరిచిన కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.

Patancheruvu Life Sentence
Life Imprisonment : తమ పెంపుడు కుక్కను చంపారనే కారణంతో ఒక వ్యక్తిని హత్యచేసి. అతని భార్యపై దాడి చేసి గాయపరిచిన కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసుస్టేషన్ పరిధిలోని రామచంద్రాపురం… రామేశ్వరంబండ వీకర్ సెక్షన్ కాలనీలో ఉప్పు ప్రశాంత్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ప్రశాంత్ ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. ఆ కుక్క ఒక రోజు సమీపంలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లింది. కోపంతో శ్రీనివాస్ కుక్కను కొట్టడంతో అది చనిపోయింది.
దీంతో ప్రశాంత్, శ్రీనివాస్‌ల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవను అప్పటితో వదిలేయుకండా …. మరింత రెచ్చిపోయిన ప్రశాంత్.. బొంబాయి కాలనీకి చెందిన మ్యాతరి ప్రకాష్, నక్కోలు వినోద్ లతో కలిసి 2014 జూలైలో శ్రీనివాస్ ఇంటిపై దాడి చేసారు.
Also Read : Guntur Crime : నది స్నానానికి వెళ్లి ఆరుగురు మృతి.. వేదపాఠశాలలో రోదనలు
ఈ దాడిలో శ్రీనివాస్ మరణించగా… అతని భార్య రేణుక తీవ్రంగా గాయపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో చార్జి షీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కోర్టులో కేసుకు సంబంధించిన వాదనలు నడుస్తున్నాయి. డిసెంబర్ 10, శుక్రవారం అడిషనల్ పీపీ మహ్మద్ మహబూబ్ వాదనలు విన్న జిల్లా రెండవ అడిషనల్ కోర్టు న్యాయమూర్తి అనిత నిందితులకు జీవిత ఖైదు విధించారు.