నిర్భయ దోషుల ఉరిశిక్షపై పటియాల కోర్టును ఆశ్రయించిన తీహార్ జైలు అధికారులు

నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై తీహార్ జైలు అధికారులు పటియాల కోర్టును ఆశ్రయించారు. దోషులకు ఉరిశిక్ష అమలుకు డెత్ వారెంట్లు జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

  • Published By: veegamteam ,Published On : February 6, 2020 / 11:13 AM IST
నిర్భయ దోషుల ఉరిశిక్షపై పటియాల కోర్టును ఆశ్రయించిన తీహార్ జైలు అధికారులు

Updated On : February 6, 2020 / 11:13 AM IST

నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై తీహార్ జైలు అధికారులు పటియాల కోర్టును ఆశ్రయించారు. దోషులకు ఉరిశిక్ష అమలుకు డెత్ వారెంట్లు జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై తీహార్ జైలు అధికారులు పటియాల కోర్టును ఆశ్రయించారు. దోషులకు ఉరిశిక్ష అమలుకు డెత్ వారెంట్లు జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నలుగురు దోషుల పిటిషన్లు ఎక్కడా పెండింగ్ లో లేవని జైలు అధికారులు పిటిషన్ లో పేర్కొన్నారు. దోషులకు శిక్ష అమలు తేదీని ఖరారు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

నిర్భయ దోషులకు న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునేందుకు ఢిల్లీ హైకోర్టు వారం రోజులు గడువు ఇవ్వడంతో తీహార్ జైలు అధికారులు అప్రమత్తం అయ్యారు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకు డెత్ వారెంట్లు జారీ చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. నలుగురు దోషుల పిటిషన్లు ఎక్కడా పెండింగ్ లో లేనందున ఉరిశిక్ష తేదీని ఖరారు చేయాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. 

మరోవైపు దోషులను ఒక్కొక్కరిగా ఉరితీసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. నిర్భయ దోషులకు వేర్వేరుగా ఉరితీయడం కుదరదని…నలుగురినీ ఒకేసారి ఉరితీయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించిన దోషులకు ఒక్కొక్కరికి ఉరి వేసేందుకు అనుమతించాలని కేంద్రం పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరుపనుంది. 

ఇప్పటికే నలుగురు దోషుల్లో వినయ్ శర్మ, ముఖేష్, అక్షయ్ కు న్యాయపరమైన మార్గాలన్ని మూసుకుపోయాయి. అక్షయ్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం తిరస్కరించారు. అయితే మరో దోషి పవన్ గుప్తాకు మాత్రమే క్యురేటివ్ పిటిషన్ తోపాటు క్షమాభిక్ష పెట్టుకునే అవకాశం ఉంది. కాగా ఢిల్లీ హైకోర్టు తీర్పు మేరకు గడువుకు చివరి రోజు పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేస్తే వ్యవహారమంతా మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. క్యురేటివ్ పిటిషన్ పై విచారణ జరిపి, దానిపై తీర్పు వచ్చే సమయానికి కనీసం 4 లేక 5 రోజులు పట్టే అవకాశం ఉంది. 

ఇక క్యురేటివ్ పిటిషన్ వెలువడ్డాక పవన్ గుప్తాకు మళ్లీ క్షమాభిక్ష పెట్టుకునే వీలు కూడా ఉంటుంది. ఒకవేళ దానిని కూడా వీలైనంత త్వరగా రాష్ట్రపతి తిరస్కరించినా నిబంధనల ప్రకారం మెర్సీ పిటిషన్ ను తిరస్కరించినా రెండు వారాల తర్వాత కానీ శిక్ష అమలు కాదు. దీంతో ఎలా చూసినా మార్చి వరకు ప్రాసెసింగ్ కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే మార్చి రెండో వారం లోపు దోషులకు శిక్ష అమలు కావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.