కోటప్పకొండ శివరాత్రి వేడుకల్లో అపశృతి

గుంటూరు : కోటప్పకొండ శివరాత్రి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఉప్పలపాడు ప్రభ కొండ వద్దకు చేరుకున్న తర్వాత పక్కన నిలబెడుతున్న సమయంలో అదుపు తప్పి పక్కకు ఒరిగి పడిపోయింది. ప్రభ కింద పడిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఎలాంటి ప్రాణాపాయం కాలేదు. వేడుకలు చూసేందుకు వచ్చిన ప్రజలు భయంతో పరుగులు తీశారు. ప్రభను లాగుతున్న భక్తులు కేకలు వేశారు.