Whatsapp Video Call : వాట్సప్ వీడియోకాల్‌తో 370 మంది మహిళలను వేధించిన యువకుడు

సోషల్ మీడియా మెసేజింగ్ యాప్‌లలో వాట్సప్ కున్నంత డిమాండ్ మరి వేటికీ లేదంటే అతిశయోక్తికాదు. బహుళ ప్రాచుర్యం పొందిన వాట్సప్ ద్వారా మహిళలకు నగ్నంగా వీడియో కాల్ చేసి వేధించాడో కీచకుడు. ఒకటి రెండూ కాదు ఏకంగా 370 మంది మహిళలను టార్చర్ చేశాడు. చివరికి పాపం పండి కటకటాలపాలయ్యాడు.

Whatsapp Video Call : వాట్సప్ వీడియోకాల్‌తో 370 మంది మహిళలను వేధించిన యువకుడు

Harassing Whats App Video Calls

Updated On : June 25, 2021 / 5:50 PM IST

Whatsapp Video Call : సోషల్ మీడియా మెసేజింగ్ యాప్‌లలో వాట్సప్ కున్నంత డిమాండ్ మరి వేటికీ లేదంటే అతిశయోక్తికాదు. బహుళ ప్రాచుర్యం పొందిన వాట్సప్ ద్వారా మహిళలకు నగ్నంగా వీడియో కాల్ చేసి వేధించాడో కీచకుడు. ఒకటి రెండూ కాదు ఏకంగా 370 మంది మహిళలను టార్చర్ చేశాడు. చివరికి పాపం పండి కటకటాలపాలయ్యాడు.

ఉత్తరప్రదేశ్ లోని  బల్లియా జిల్లాకు చెందిన 35 ఏళ్ల శివకుమార్ వర్మ అనే వ్యక్తి  గర్హ్వార్ పోలీసు స్టేషన్ పరిధిలో స్టేషనరీ షాపు నిర్వహిస్తున్నాడు. అతను మహిళలను లైంగికంగా వేధించేవాడు.  ఇందుకోసం అతను 7 మొబైల్ ఫోన్లు ఉపయోగించాడు.  ప్రతి సారీ ఒక కొత్త సిమ్ కార్డు ఉపయోగించి మహిళలను వేధించేవాడు.  అనంతరం ఆ సిమ్ కార్డును నాశనం చేసేవాడు.

మహిళల నెంబర్లు తెలుసుకోటానికి మొబైల్ కీ ప్యాడ్ పై ఇష్టం వచ్చినట్లు 10 నెంబర్లు టైప్ చేసేవాడు.  ఆ నెంబర్లు ట్రూ కాలర్లో చెక్ చేసేవాడు. అందులో మహిళల పేర్లు వస్తే ఆ పేరు సేవ్ చేసుకుని వారికి వాట్సప్ వీడియో కాల్ చేసేవాడు. వాట్సప్ వీడియో కాల్ చేసేటప్పుడు  ఫోన్  స్క్రీన్ రికార్డ్ మోడ్ లో ఉంచి…తాను వారి ముందు నగ్నంగా ఉండేవాడు.

ఇది గమనించిన మహిళలు వెంటనే కాల్ కట్ చేసేవారు.  అప్పటికే స్క్రీన్  రికార్డింగ్  మోడ్‌లో ఉండటంతో  వీడియో రికార్డయ్యేది. ఆ వీడియోను మహిళలకు పంపించి వారిని లైంగికంగా వేధించేవాడు.  పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తే.. తన వద్ద వున్న స్క్రీన్  రికార్డింగ్ వీడియోలను వారి భర్తలకు, బంధువులకు పంపుతానని బెదిరించేవాడు.

ఇతని బెదిరింపులకు భయపడి మహిళలు  పోలీసులకు ఫిర్యాదు చేయటానికి భయపడేవారు.  కొంతమంది నెంబర్లు మార్చుకునేవారు.  ఈరకంగా వర్మ యూపీలోని  15 జిల్లాలకు చెందిన 370 మంది మహిళలను వేధింపులకు గురిచేశాడు. కాగా ఫిబ్రవరి 2020లో  లక్నోకి చెందిన ఒక మహిళ వర్మకు వ్యతిరేకంగా 1090 నెంబర్‌కు ఫిర్యాదు చేసింది.

పోలీసులు  పలుమార్లు అతడిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసేవారు. అయినా అతడిలో మార్పురాలేదు.  మళ్లీ తన పాత పంథానే కొనసాగించసాగాడు. ఈనేపధ్యంలో అతని ప్రవర్తన మారకపోవటంతో ఇటీవల పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వర్మను అరెస్ట్ చేశారు.