Uttar Pradesh: పెంపుడు తల్లి ఘాతుకం.. పదకొండేళ్ల దత్త కూతురుకు చిత్ర హింసలు.. మర్మావయవాలపై దాడి
బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గాయాలు చూసి షాకయ్యారు. ఒంటిపైనే కాదు.. బాలిక మర్మావయవాల్లోనూ గాయాలయ్యాయి. కలప భాగాల్ని ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో గుర్తించారు. బాలిక స్థితిపై అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు.

Uttar Pradesh: మైనర్ బాలికపై పెంపుడు తల్లి ఘాతుకానికి పాల్పడింది. బాలికను తీవ్ర చిత్ర హింసలకు గురి చేసింది. అంతేకాదు.. మర్మావయవాలపై దాడి చేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, ప్రయాగరాజ్‌లో జరిగింది. తీవ్ర గాయాలతో ఉన్న బాలికను ఒక మహిళ ఆస్పత్రిలో చేర్చింది.
Disney Layoffs: డిస్నీలో ఉద్యోగాల కోత.. ఎవరిని తొలగించాలో గుర్తించాలని మేనేజర్లకు ఆదేశం
ఇంట్లో తోబుట్టువులతో జరిగిన గొడవలో బాలిక గాయపడినట్లు చెప్పింది. ఆమెకు చికిత్స అందించాల్సిందిగా చెప్పి వెళ్లింది. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గాయాలు చూసి షాకయ్యారు. ఒంటిపైనే కాదు.. బాలిక మర్మావయవాల్లోనూ గాయాలయ్యాయి. కలప భాగాల్ని ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో గుర్తించారు. బాలిక స్థితిపై అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. బాలికపై తీవ్రమైన దాడి జరిగిందని పోలీసులకు చెప్పారు. మరుసటి రోజు బాలికను తీసుకొచ్చిన మహిళ ఆస్పత్రికి వచ్చింది. అప్పుడు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా, తాను బాలికను తాను దత్తత తీసుకున్నట్లు, ఇంట్లో పిల్లలతో జరిగిన గొడవలో బాలిక గాయపడినట్లు ఆమె పోలీసులకు చెప్పింది.
అయితే, ఆమె సమాధానంతో సంతృప్తి చెందని పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గైనకాలజిస్టుల ఆధ్వర్యంలో బాలికను పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. బాలిక చేయి కూడా విరిగినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం బాలికను ప్రభుత్వ సంక్షేమ కేంద్రానికి తరలించనున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, తన పెంపుడు తల్లి తనను చిత్ర హింసలకు గురి చేసిందని బాలిక తెలిపింది. నెలలో సగం రోజులు ఆహారం ఇచ్చే వారని, ఆకలితోనే ఉండేదాన్నని బాలిక చెప్పింది. దీంతో నిందితురాలైన మహిళపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.