Cheddi Gang : చెడ్డీగ్యాంగ్‌లో కీలక నిందితుడు అరెస్ట్
విజయవాడ శివారు ప్రాంతాలలో గతేడాది కలకలం రేపిన చెడ్డీగ్యాంగ్ దొంగతనాలకు సంభిందించి కీలక ముఠా సభ్యుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.

Vijayawada Cheddi Gang
Cheddi Gang : విజయవాడ శివారు ప్రాంతాలలో గతేడాది కలకలం రేపిన చెడ్డీగ్యాంగ్ దొంగతనాలకు సంభిందించి కీలక ముఠా సభ్యుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కాలు రుమాల్ హతి ఏపీ, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలలో జరిగిన 72 దొంగతనాల్లో నిందితుడుగా ఉన్నాడని విజయవాడ పశ్చిమ జోన్ డీసీపీ కే బాబూరావు తెలిపారు.
నిందితులు గుజరాత్ లోని దాహుద్ జిల్లా, గర్బజా తాలూకాకు చెందిన గుల్బర్ గ్రామస్తులు. వీరంతా దోపిడీకి వచ్చే టప్పుడు నిక్కరు ధరించి రావటంతో చెడ్డీ గ్యాంగ్ గా పేరుపొందారు. కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లి కూలి పనులు చేస్తూ ,పనులు లేని సమయంలో ఆయా నగర శివారు ప్రాంతాలలో పగలు రెక్కీ నిర్వహించి రాత్రి పూట దొంగతనాలు చేయటంలో సిధ్దహస్తులు.
గతేడాది నవంబర్ 28 వ తేదీన విజయవాడ కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలోని మిల్క్ ప్రాజెక్ట్ సమీపంలోని అపార్ట్ మెంట్ లోనూ…డిసెంబర్ 1వ తేదీన ఇబ్రహీంపట్నంలోని గుంటుపల్లి లో దొంగతనం చేసి పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజి ద్వారా పోలీసులు చెడ్డీ గ్యాంగ్ లోని కామ్డి మేడా అనే నిందితుడిని డిసెంబర్ 17న అరెస్ట్ చేసి కొంత సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు విచారణలో భాగంగా మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Also Read : Rahul Gandhi : రాహుల్‌కి మరో షాక్-ఎన్ఎస్‌యూఐ నేతలతో ములాఖత్ కి నో పర్మిషన్
ఇప్పడు అరెస్ట్ కాబడిన నిందితుడు కాలు రుమాల్ హతిపై నిఘా పెట్టిన పోలీసులు అత్యంత చాకచక్యంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. కాలు రుమాల్ విజయవాడ పరిసర ప్రాంతాలలో సంచరిస్తూ తమ గ్యాంగ్ సభ్యుల క్షేమ సమాచారములను వారి వారి కుటుంబ సభ్యులకు చేరవేయటం.. అరెస్ట్ కాబడిన సభ్యులకు న్యాయ సహాయం చేయటం వంటి పనులు చేస్తూ ఉండేవాడు. కాలు రమాల్ హతి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు నిందితుడు ఈ రోజు ఉదయం విజయవాడ రాగానే అరెస్ట్ చేసారు.