కులం పేరుతో దూషించిన సర్పంచ్ భర్తకు దేహశుధ్ధి

కులం పేరుతో దూషించిన సర్పంచ్ భర్తకు దేహశుధ్ధి

Updated On : January 26, 2021 / 6:31 PM IST

villagers attacked sarpanch husband in ramannapeta mandal yadadri district :  కులం పేరుతో దూషించి బెదిరించిన సర్పంచ్ భర్తకు దేహశుధ్ధి చేశారు గ్రామస్తులు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం శోభనాద్రిపురంలో అధికార పార్టీ సర్పంచ్ భర్త కాల్వ శ్రవణ్ పల్లె ప్రగతి కార్యక్రమంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదు.

బిల్లలు ఇవ్వకపోగా అడిగిన వారినే తిరిగి బెదిరించటం మొదలెట్టాడు. ఇటీవల పల్లె ప్రగతి పని చేసిన గ్రామస్తులు వచ్చి డబ్బులు అడిగినందుకు కులంపేరుతో దూషించాడు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి పెనుగులాటకు దారితీసింది. దీంతో గ్రామస్తులు అతడ్ని చితకబాదారు.  ఆ టైమ్ లో కొందరు  ఆ దృశ్యాలు సెల్ ఫోన్ లో వీడియో తీశారు    అవి ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.