సీఎం జగన్ పై అసభ్యకర పోస్ట్.. వ్యక్తి అరెస్ట్

పోలీసులు హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టింగ్స్ పెట్టి చిక్కుల్లో పడుతున్నారు. పీఎం, సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులపై వల్డర్

  • Published By: veegamteam ,Published On : October 17, 2019 / 03:25 AM IST
సీఎం జగన్ పై అసభ్యకర పోస్ట్.. వ్యక్తి అరెస్ట్

Updated On : October 17, 2019 / 3:25 AM IST

పోలీసులు హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టింగ్స్ పెట్టి చిక్కుల్లో పడుతున్నారు. పీఎం, సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులపై వల్డర్

పోలీసులు హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టింగ్స్ పెట్టి చిక్కుల్లో పడుతున్నారు. పీఎం, సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులపై వల్డర్ కామెంట్స్ చేసి కటకటాల పాలవుతున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టి ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అరెస్ట్ వెలుగులోకి వచ్చింది.

సీఎం జగన్‌పై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్‌ పెట్టిన యువకుడిని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన మేదరమెట్ల సురేశ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మేజిస్ర్టేట్‌ రిమాండ్‌ విధించడంతో సురేశ్‌ను జైలుకి తరలించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయ సైబర్‌ క్రైం స్టేషన్‌లో 7/2019గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో సోషల్‌ మీడియాలో పోస్టింగ్స్‌ పెట్టే సమయంలో ప్రతి ఒక్కరు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని సీఐడీ ఎస్పీ ప్రశాంతి సూచించారు. ఇతరుల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే విధంగా కామెంట్స్ చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాజ్యాంగ బద్దమైన, ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారిని దూషించడం, అసభ్యకరంగా మాట్లాడటం, అనుచిత పోస్టింగ్స్ పెట్టడం చట్టరిత్యా నేరం. అలా చేస్తే అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అయినా హద్దులు క్రాస్ చేసి కటకటాల పాలవుతున్నారు.