Woman killed man : వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధింపులు

Woman killed man : వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధింపులు

Woman Killed Man

Updated On : April 23, 2021 / 12:07 PM IST

Woman killed man, he harassing for extramarital affair : వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్న పక్కింటి వ్యక్తిని ఓ మహిళ తన సోదరుడితో కలిసి హతమార్చిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని  బిచ్కుందలో మైత్రి హనుమండ్ల అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను తన పక్కింటి మహిళ నాగమణి పై కన్నేశాడు.  తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఆమెను వేధించసాగాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు.  అయినా హనుమండ్ల వేధింపులు ఎక్కువయ్యే సరికి ఆమె తక్కడ్ పల్లిలో ఉండే తన అన్న బాలయ్యకు చెప్పింది.

ఇద్దరూ కలిసి  ఏప్రిల్ 16న హనమండ్లను బిచ్కుంద సౌదర్ చెరువు గట్టు వద్దకు రప్పించారు.  అక్కడ హనుమండ్లను గొంతు నులిమి హత్య చేశారు.  మృతదేహాన్ని చెరువులో పడేసి వెళ్లి పోయారు. హనుమండ్ల మృతదేహం  ఏప్రిల్ 18న బయట పడింది.  సమాచారం తెలుసుకున్నపోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కు ఆస్పత్రికి పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.