శృంగారం చేస్తుండగా తల్లి చూసిందని యువతి సూసైడ్

శృంగారం చేస్తుండగా తల్లి చూసిందని యువతి సూసైడ్

Updated On : June 22, 2021 / 4:19 PM IST

తన ప్రియుడితో  శృంగారంలో ఉండగా తల్లి చూసిందని భయపడి ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్దాన్ లో జరిగింది. బుండి జిల్లా జెండోలి ప్రాంతంలోని చోత్రకా ఖేడా గ్రామంలో లో నివసించే 18 ఏళ్ల యువతి ఆదివారం రాత్రి తన ప్రియుడితో శృంగారంలో ఉండగా ఆమె తల్లి చూసింది.

చూసినా ఆమె ఏమీ మాట్లడకుండా ఇంటికి వెళ్లిపోయింది. కుమార్తె ఇంటికి వెళ్లాక తల్లీ,కూతుళ్ళు ఇద్దరూ ఆవిషయం గురించి ఏమీ మాట్లాడకుండా మాములుగానే నిద్ర పోయారు.

సోమవారం ఉదయం తల్లి బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆ యువతి ఇంట్లో వంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం రాత్రి కుమార్తెతో కలిసిన ఆమె ప్రియుడి పై తల్లి ఫిర్యాదు చేసింది.

అత్యాచారం, ఆత్మహత్యకు పురికొల్పాడనే కారణంతో పోలీసులు కేసు నమోదు చేసారు. పోలీసులు  యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి  కుటుంబ సభ్యులకు అప్పగించారు. పారిపోయిన ఆమె ప్రియుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Read Here>>కథ అడ్డం తిరిగింది, చెల్లి పెళ్లి డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా, సల్మాన్ అరెస్ట్