APPSC లో 31 గెజిటెడ్ పోస్టులు : దరఖాస్తుకు చివరి తేది.ఏప్రిల్ 16,2019

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 31 గెజిటెడ్ పోస్టులభర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
విభాగాల వారీగా ఖాళీలు
*అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ -4
*అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్-3
*అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్-2
*సివిల్ అసిస్టెంట్ సర్జన్-9
*జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్-6
*అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ & కంట్రీ ప్లానింగ్-2
*అసిస్టెంట్ కెమిస్ట్-1
*టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ -1
*రాయల్టీ ఇన్స్పెక్టర్ -2
*టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ పోలీస్ ట్రాన్స్ పోర్టు ఆర్గనైజేషన్-1
అర్హత: పోస్టులను బట్టి బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీబీఎస్,సంబంధిత విభాగాల్లో బీఈ,బీటెక్,పీజీ డిప్లోమా, ఎంఎస్సీ ఉత్తీర్ణత
వయస్సు : జులై 1,2019 నాటికి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసరు పోస్టుకు గరిష్టంగా 52 ఏళ్లమధ్య ఉండాలి. మిగిలిన వాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రోసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామ్ ఫీజు. రూ.120 చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ నిరుద్యోగ యువత, తెల్లరేషన్ కార్డు దారులకు ఎగ్జామ్ ఫీజు ఉండదు.
దరఖాస్తు ప్రారంభం: మార్చి 26, 2019
దరఖాస్తు చివరి తేదీ : ఏప్రిల్ 15,2019
ఫీజు చెల్లించుటకు చివరి తేదీ : ఏప్రిల్ 15,2019,
పూర్తి వివరాలకు htps://psc.ap.gov.in ను సందర్శించగలరు .