Journalism Diploma Course : ఏపీ ప్రెస్ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు !
ఇంటర్ విద్యార్హత కలిగి ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో జర్నలిస్టులుగా పనిచేస్తున్నవారు, అలాగే డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 6 నెలలపాటు కోర్సు కాల వ్యవధిగా నిర్ణయించారు.

AP Press Academy Journalism Diploma Course Admission Applications!
Journalism Diploma Course : గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంచడం లక్ష్యంగా సి. రాఘవాచారి ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి జర్నలిజం లో డిప్లొమా కోర్సు ను ఈ ఏడాది నుండి ప్రారంభించనుంది. కోర్సు నిర్వాహణకు గాను ఇప్పటికే అచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకుంది. ఈ నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది.
READ ALSO : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోవాలంటే రోజువారిగా ఈ కూరగాయలను ఆహారంలో చేర్చుకోవటం మంచిది!
ఇంటర్ విద్యార్హత కలిగి ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో జర్నలిస్టులుగా పనిచేస్తున్నవారు, అలాగే డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 6 నెలలపాటు కోర్సు కాల వ్యవధిగా నిర్ణయించారు. ఈ డిప్లొమా కోర్సు ఆన్ లైన్ విధానం లో ఉంటుంది. కోర్సు పూర్తయినతరువాత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహించి, డిప్లొమా సర్టిఫికేట్‌ను ప్రదానం చేస్తుంది.
READ ALSO : ఈ ఆహారంతో పిల్లల్లో కాల్షియం లోపానికి చెక్
అభ్యర్ధుల దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా జర్నలిస్టులు రూ.1500, ఇతరులు రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించేందుకు ఏప్రిల్ 15 తుదిగడువుగా నిర్ణయించారు. మేనెలలో కోర్సు ప్రారంభమౌతుంది. అభ్యర్థులు దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; కార్యదర్శి, ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, # 40-6/4-8, 4వ అంతస్తు, రెవెన్యూ కాలనీ, మొఘల్‌రాజపురం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ – 520 010
ఇతర సమాచారం కోసం ఫోన్: 9154104393, ఈమెయిల్: pressacademycontact@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్; https://pressacademy.ap.gov.in/ పరిశీలించగలరు.