నిరుద్యోగులకు శుభవార్త : ఏపీలో ఉద్యోగాల జాతర

  • Published By: chvmurthy ,Published On : October 30, 2019 / 02:16 AM IST
నిరుద్యోగులకు శుభవార్త : ఏపీలో ఉద్యోగాల జాతర

Updated On : October 30, 2019 / 2:16 AM IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగాల జాతరను కొనసాగిస్తోంది. రాష్ట్రంలో మరో ఉద్యోగాల ప్రకటన వెలువడనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న  వార్డు  వలంటీర్ పోస్టులను నవంబర్ 3 వ వారానికల్లా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ వలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉండరాదన్నారు. గ్రామ సచివాలయాల్లో పోస్టులన్నింటినీ త్వరలో భర్తీచేయాలని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదలవనుంది. వివిధ పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల పరిధిలో 19,170 వార్డు వలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన పూర్తి వివరాలను వెల్లడించారు.

మొత్తం 19,170 వార్డు వాలంటీర్ల ఖాళీలు భర్తీ  చేపడుతున్నారు. 
నవంబర్ 1 నుండి భర్తీ ప్రక్రియ ప్రారంభం
నవంబర్ 10 వరకు అభ్యర్థులు నుండి దరఖాస్తులు స్వీకరణ
నవంబర్ 15 వరకు దరఖాస్తులు పరిశీలన
నవంబర్ 16 నుండి 20 వరకు ఇంటర్వ్యూ లు
నవంబర్‌ 22న ఎంపికయిన వార్డు వాలంటీర్ల జాబితా ప్రకటన
డిసెంబర్ నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి