CBSE విద్యార్థులకు మూడు కొత్త సబ్జెక్టులు

  • Published By: veegamteam ,Published On : March 25, 2019 / 10:18 AM IST
CBSE విద్యార్థులకు మూడు కొత్త సబ్జెక్టులు

Updated On : March 25, 2019 / 10:18 AM IST

CBSE విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచి పాఠ్యాంశాల జాబితాలో మూడు కొత్త సబ్జెక్టులు వచ్చి చేరనున్నాయి. CBSE పాఠశాలల బోధన ప్రణాళికలో కృత్రిమ మేధ, యోగ, చిన్నారుల సంరక్షణ విద్యను పాఠ్యాంశాలుగా బోధించనున్నారు. ఈ మూడు కూడా విద్యలో భాగం కానున్నాయి. ఇటీవల CBSE బోర్డు నిర్వహించిన సమావేశంలో ఈ మూడు సబ్జెక్టులను CBSEలో కొత్తగా చేర్చనున్నట్లు నిర్ణయించిందని CBSE ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2019-20 విద్యాసంవత్సరం నుంచి 9వ తరగతి విద్యార్థులకు 6వ సబ్జెక్టుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌(AI)ను ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు.

CBSEలో ఉన్న నిబంధనల ప్రకారం విద్యార్థులకు ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకొనే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రస్తుత ఐదు తప్పనిసరి పాఠ్యాంశాలకు ఈ రెండింటిలో ఒకటి అదనపు పాఠ్యాంశం అవుతుంది. 6వ సబ్జెక్టుగా విద్యార్థి నైపుణ్యాన్ని తీర్చిదిద్దే ఏ సబ్జెక్టునైనా ఎంచుకోవచ్చు. మిగిలిన వాటిలాగే ఆ సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షలూ రాయాల్సి ఉంటుంది.

మరోవైపు పదోతరగతి విద్యార్థులు సైతం బోర్డు పరీక్షల కోసం ఇప్పుడున్న 5 ప్రధాన సబ్జెక్టులకు అదనంగా కొత్తగా ఒక ఆప్షనల్‌ సబ్జెక్టును ఎంచుకోవాలని కొద్దిరోజుల క్రితం CBSE కోరిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఏదైనా ఓ ప్రధాన సబ్జెక్టులో విద్యార్ధి ఫెయిలైతే, దానికి బదులు అతడికి ఆప్షనల్‌ సబ్జెక్టులో వచ్చిన పాస్‌ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. గతంలోలాగే ఫెయిలైన సబ్జెక్టుకు సప్లిమెంటరీ రాసే అవకాశం ఉంటుంది. ఆసక్తిగల విద్యాసంస్థలు మార్చి31లోగా దరఖాస్తులు ఇవ్వాలని CBSE కోరింది.