CBSE Class 12 Exam : సీబీఎస్‌ఈ విద్యార్థుల కోసం ఆప్షనల్ ఎగ్గామ్.. ఎప్పటినుంచంటే?
కరోనా సమయంలో అన్ని పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సీబీఎస్‌ఈ ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్య ఆప్షనల్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని CBSE బోర్డు సుప్రీం కోర్టుకు తెలిపింది.

Cbse To Sc Optional Class 12 Exam Can Be Conducted Between 15 Aug And 15 Sept
CBSE Class 12 Exam : కరోనా సమయంలో అన్ని పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సీబీఎస్‌ఈ ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్య ఆప్షనల్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని CBSE బోర్డు సుప్రీం కోర్టుకు తెలిపింది. సోమవారం దీనికి సంబంధించి సుప్రీం కోర్టులో అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది.
మార్కింగ్ వ్యవస్థ ద్వారా ఫైనల్ మార్క్స్‌ను లెక్కించే విధానంపై వివాదాలు తలెత్తాయి. దాంతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని సీబీఎస్‌ఈ విన్నవించింది. తుది ఫలితాలను జూలై 31న విడుదల చేస్తామని స్పష్టం చేసింది. సీబీఎస్ఈ పరీక్ష రాయాలనుకునేవారికి ఆప్షనల్ ఎగ్జామ్ నిర్వహించనుంది బోర్డు.
ఈ ఆప్షనల్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ విధానంలో ఉంటుందని సీబీఎస్‌ఈ వెల్లడించింది. కరోనా తగ్గుముఖంతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిసింది. బోర్డు ప్రకటించే ఫలితాలపై అసంతృప్తిగా ఉన్న విద్యార్థులు ఈ ఆప్షనల్ ఎగ్జామ్స్ రాసే అవకాశం కల్పిస్తోంది.
ఆప్షనల్ ఎగ్జామ్స్ ఎంచుకున్నవారికి ఇందులో వచ్చే మార్కులే తుది ఫలితంగా పరిగణిస్తారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఏవైనా అభ్యంతరాలు ఉంటే విద్యార్థులు ఫిర్యాదుల పరిష్కార కమిటీని సంప్రదించవచ్చు.