C-DAC Recruitment 2025: సీ-డాక్‌ లో రిక్రూట్‌మెంట్.. భారీగా ఉద్యోగాలు.. రూ.37 వేలు జీతం.. ఇలా అప్లై చేసుకోండి

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(C-DAC) శుభవార్త చెప్పింది. సంస్థలో ప్రాజెక్ట్ సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

C-DAC Recruitment 2025: సీ-డాక్‌ లో రిక్రూట్‌మెంట్.. భారీగా ఉద్యోగాలు.. రూ.37 వేలు జీతం.. ఇలా అప్లై చేసుకోండి

c-dac recruitment 2025

Updated On : June 30, 2025 / 3:13 PM IST

నిరుద్యోగులకు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(C-DAC) శుభవార్త చెప్పింది. సంస్థలో ప్రాజెక్ట్ సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 91 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఫ్రెషర్ లాంటి పోస్టులను అధికారులు బి భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులకు వెంటనే అప్లై చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు.

విద్యార్హతలు: ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు భారతదేశంలో గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుండి బీఈ లేదా బిటెక్ డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంటుంది.

వయోపరిమితి: ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుకి గరిష్ట వయసు 56 సంవత్సరాలు మించకూడదు. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ గరిష్ట వయసు 40 సంవత్సరాలు, అనుభవం ఉన్న ప్రాజెక్ట్ ఇంజనీర్ గరిష్ట వయసు 45 సంవత్సరాలు, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఫ్రెషర్ గరిష్ట వయసు 30 సంవత్సరాలుగా. విభాగాలు, పోస్టులను బట్టి వయోపరిమితి నిర్ణయించబడుతుంది. ఆలాగే రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతన వివరాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ప్రకారం కనీస జీతం నెలకు రూ.37,500 నుంచి రూ.1,10,000 గా ఉంటుంది.

కావాల్సిన ధ్రువపత్రాలు: 10వ, 12వ తరగతి మార్కుల షీట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం లాంటివి అవసరం అవుతాయి.

దరఖాస్తు ఇలా చేసుకోండి:

అభ్యర్థులు C-DAC cdac.in అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్లి సూచనల మేరకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ జూలై 09, 2025 గా నిర్ణయించారు. జూలై నాల్గో లేదా ఐదో వారంలో వాక్-ఇన్-ఇంటర్వ్యూకు జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకుంటారు.