CUET UG 2022 : సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు సియూఈటీ యూజీ 2022 నోటిఫికేషన్

దరఖాస్తు ఫీజుకు సంబంధించి జనరల్, అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు స్లాట్ 1 కోసం రూ.650, స్లాట్ 2 కోసం రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ,ఎన్సిఎల్ అభ్యర్థులు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

CUET UG 2022 : సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు సియూఈటీ యూజీ 2022 నోటిఫికేషన్

Cuet (ug) 2022

Updated On : April 8, 2022 / 3:48 PM IST

CUET UG 2022 : సెంట్రల్ యూనివర్సిటీల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ CUET(UG)2022 కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ పరీక్ష కోసం దేశంలోని 547 సిటీల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. దేశం బయట 13 సిటీల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మే 6వ తేదీ వరకు దరఖాస్తులు పంపేందుకు తుదిగడువుగా నిర్ణయించారు. పరీక్షను జులై మొదటి, రెండవ వారంలో నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. పరీక్ష రెండు స్లాట్లలో నిర్వహించనున్నారు. స్లాట్ 1 కు సంబంధించి 3 గంటల 15 నిమిషాల సమయం కేటాయించారు. స్లాట్-2 కు సంబంధించి 3 గంటల 45 నిమిషాల సమయం ఉంటుంది.

దరఖాస్తు ఫీజుకు సంబంధించి జనరల్, అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు స్లాట్ 1 కోసం రూ.650, స్లాట్ 2 కోసం రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ,ఎన్సిఎల్ అభ్యర్థులు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పిడ్ల్యూబీడీ, థర్డ్ జండర్ అభ్యర్థులు రూ.550 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు భారత దేశానికి బయట ఉన్న ఎగ్జామ్స్ సెంటర్లను ఎంచుకుంటే రూ.3 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://cuet.samarth.ac.in/ వెబ్ సైట్ ను పరిశీలించగలరు.