DU Starts Admission : హిందూ స్టడీస్, చైనీస్ స్టడీస్ పేరుతో కొత్త పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ

హిందూ స్టడీస్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా రంగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. UR, OBC-NCL, EWS, SC, ST అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 8,960. గా నిర్ణయించారు.

DU Starts Admission : హిందూ స్టడీస్, చైనీస్ స్టడీస్ పేరుతో కొత్త పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ

DU Starts Admission

DU Starts Admission : ఢిల్లీ విశ్వవిద్యాలయం (DU) మూడు కొత్త కోర్సుల కోసం అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించింది MA ఇన్ హిందూ స్టడీస్, చైనీస్ స్టడీస్, మరియు PG డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ లా వంటి కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 30తో ముగియనుంది. యూనివర్సిటీ బులెటిన్ ప్రకారం, ఈ కోర్సులు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేటిక్స్, బిజినెస్ మరియు పొలిటికల్ సైన్స్ వంటి ప్రస్తుత విభాగాలతో పాత హిందూ తాత్విక జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. విద్యార్థులకు చైనీస్ భాషలో ప్రావీణ్యం సంపాదించడంలో సహాయపడుతుంది. ఇటీవలి సైబర్ పురోగతిపై వారిలో అవగాహనను పెంపొందించేందుకు తోడ్పడతాయి.

READ ALSO : Silkworms Cultivation : పట్టుపరిశ్రమకు విసృత్త రాయితీలు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సాగు

హిందూ స్టడీస్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా రంగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. UR, OBC-NCL, EWS, SC, ST అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 8,960. గా నిర్ణయించారు. వికలాంగులకు (PwBD) రుసుము రూ. 2,240.

చైనీస్ స్టడీస్‌లో ఆసక్తిగల అభ్యర్థి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీతో పాటు, ఢిల్లీ విశ్వవిద్యాలయం లేదా UGC-గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నిర్వహించే చైనీస్‌లో ఒక సంవత్సరం (పూర్తి సమయం) PG ఇంటెన్సివ్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి. ప్రోగ్రామ్ కోసం మొత్తం 49 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

READ ALSO : Iron Cookware : ఇనుప పాత్రల్లో వంట చేస్తే శరీరానికి కావాల్సిన ఐరన్ దొరుకుతుందట.. నిజమేనా?

సైబర్ సెక్యూరిటీ అండ్ లాలో పీజీ డిప్లొమా విషయానికి వస్తే డిగ్రీ పరీక్షలో సాధించిన మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థుల ప్రవేశం ఉంటుంది. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా తత్సమానం ఉన్న గ్రాడ్యుయేట్లు కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రోగ్రామ్ కోసం మొత్తం 64 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

READ ALSO : Safflower Cultivation : కుసుమలో అధిక దిగుబడుల కోసం సాగులో పాటించాల్సిన మెళకువలు

కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ అప్లికేషన్స్/సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్/కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత డిగ్రీ పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా ప్రవేశం మంజూరు చేయబడుతుంది. ఢిల్లీ యూనివర్శిటీ ప్రారంభించిన ఈ ప్రోగ్రామ్‌ల గురించి పూర్తి వివరాలకోసం అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ ; https://www.admission.uod.ac.in/ సందర్శించవచ్చు.