Yogivemana University : యోగివేమన విశ్వ విద్యాలయంలో దూరవిద్య కోర్సులు

యూజీసీ కి వైవియు దూర విద్యా కోర్సుల నిర్వాహణ కోసం అనుమతికి దరఖాస్తు చేయగా ఈ ఏడాది జూన్ 26, 27లో యూజీసీ వర్చువల్ విధానంలో యూనివర్సిటీ వసతులు, స్థితిగతులపై నిపుణులు కమిటి పరిశీలిన జరిపింది. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న మొత్తం 15 కోర్సుల భోధనకు సిఫార్సు చేసింది.

Yogivemana University : యోగివేమన విశ్వ విద్యాలయంలో దూరవిద్య కోర్సులు

Yogi Vemana university

Updated On : August 9, 2023 / 8:01 AM IST

Yogivemana University : వైఎస్సార్ జిల్లా యోగివేమన విశ్వ విద్యాలయంలో దూరవిద్య,ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు , జిల్లాలకు చెందిన వారు ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా వివిధ రకాల కోర్సుల్లో విద్యను అభ్యసించేందుకు అవకాశం లభించనుంది.

READ ALSO : Gold Rate Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

గత సంవత్సరం ఈ విశ్వవిద్యాలయానికి న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు లభించింది. దీంతో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఇదే విషయాన్ని యోగివేమన యూనివర్శిటీ విసి చింతా సుధాకర్ తెలిపారు. రాష్ట్రంలోని ఇతర యూనివర్శిటీల కన్నా తమ యూనివర్శిటీ మెరుగైన విద్యను అందించటంలో మెరుగైన స్ధాయిలో ఉన్నట్లు తెలిపారు.

READ ALSO : RedGram Management : ఖరీఫ్ కంది రకాలు.. సాగు యాజమాన్యం

యూజీసీ కి వైవియు దూర విద్యా కోర్సుల నిర్వాహణ కోసం అనుమతికి దరఖాస్తు చేయగా ఈ ఏడాది జూన్ 26, 27లో యూజీసీ వర్చువల్ విధానంలో యూనివర్సిటీ వసతులు, స్థితిగతులపై నిపుణులు కమిటి పరిశీలిన జరిపింది. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న మొత్తం 15 కోర్సుల భోధనకు సిఫార్సు చేసింది. 2023-24 ఏడాది నుండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు విసి సుధాకర్ తెలిపారు.

READ ALSO : Rahul Gandhi : నేడు అవిశ్వాస తీర్మానంపై మాట్లాడనున్న రాహుల్

కోర్సుల వివరాలకు సంబంధించి బీఏ జనరల్, బీఏ (హిస్టరీ,ఎకనామిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్) బీఏ (ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్,కంప్యూటర్ అప్లికేషన్స్) బీకాం,బీఏ(హిస్టరీ, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్) బీఏ(హిస్టరీ, పొలిటికల్ సైన్స్, స్పెషల్ తెలుగు)

READ ALSO : Green Gram Cultivation : ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాలకు అనువైన పెసర.. అధిక దిగుబడల కోసం మేలైన యాజమాన్యం

పీజీ కోర్సులకు సంబంధించి ఏంఏ(హిస్టరీ), ఎంఏ(తెలుగు), ఎంఏ( ఎకనామిక్స్)ఎంఏ(ఇంగ్లీషు)ఎంఏ(జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్), ఎంఏ( మ్యాధమ్యాటిక్స్), ఎంకాం, ఎంఏ( పొలిటికల్ సైన్స్) కోర్సులు అందుబాటులో ఉన్నాయి.