DONT MISS : కరీంనగర్ లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

ఆర్మీలో ఉద్యోగం సాధించాలనే వారికి మంచి అవకాశం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. అక్టోబర్ 7 నుంచి 17 తేదీ వరకు డా. బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 22 వ తేదీ వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 23 నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థి ఏ రోజు ఏ టైం కు రావాలో అడ్మిట్ కార్డు పై ఉంటుంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు వెరిఫికేషన్ పేపర్స్ ని తీసుకెళ్లాల్సి ఉంటుంది.
పోస్టులు :
* సోల్జర్ జనరల్ డ్యూటీ
* సోల్జర్ టెక్నికల్
* సోల్జర్ ఏవియేషన్ అండ్ అమ్యూనేషన్ ఎగ్జామినర్
* నర్సింగ్
* వెటర్నరీ అసిస్టెంట్
* క్లర్క్ , స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మన్.
ఎంపిక విధానం:
మెడికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక
వయసు:
17 ఏళ్ల నుంచి 23 ఏళ్లు మధ్య వయసున్న యువకులు మాత్రమే అర్హులు.
ర్యాలీకి ఎలా రావాలంటే?
అభ్యర్థులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంకు రావాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతోపాటు అందులో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకురావాలి. షేవింగ్ చేసుకోకపోయినా, శరీరంపై పర్మినెంట్ టాటూలు ఉన్నా అనుమతించరు.